ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సంతకాల సేకరణ

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 23, జన్నారం.

ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్ ఎస్ యు ఐ మంచిర్యాల జిల్లా నాయకులు అజ్మత్ ఖాన్ ఆధ్వర్యంలో గురువారం రోజున మండలంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో హాజరైన విద్యార్థులు అందర్నీ పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల్లో హాజరై చాలు అందర్నీ పాస్ చేస్తామని చెప్పి సగం మందికి పైగా విద్యార్థులను ఫెయిల్ చేయదాంతో, మనస్థాపానికి గురి చెంది విద్యార్థులు మృతి చెందుతున్నారని, విద్యార్థుల హత్యకు తెలంగాణ ప్రభుత్వమే కారణమని తెలుపుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు హాజరైన విద్యార్థులు అందర్నీ పాస్ చెయ్యాలని ఎన్ ఎస్ యూ ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. విద్యార్థులందరినీ పాస్ చేసేదాక ఎన్ ఎస్ ఎస్ యు ఐ పోరాటం ఆగేది లేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల నాయకులు అభినయ్, చింటూ, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube