రహదారి తో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

బురద రోడ్డుగా మారిన లడక బజార్ సిమెంట్ రోడ్డు

1
TMedia (Telugu News) :

 

రహదారి తో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

బురద రోడ్డుగా మారిన లడక బజార్ సిమెంట్ రోడ్డు

టీ మీడియా, జూన్27, మధిర: పట్టణంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న మిషన్ భగీరథ పనుల తో రహదారులు అన్ని గుంటలు తీయడంతో పట్టణంలోని సెంట్ ఫ్రాన్సిస్ హై స్కూల్ కు వెళ్లడానికి ఉన్న రహదారి గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి గుంతల మయం బురదమయం తో తీవ్ర ఇబ్బందులు పడుతూ పాఠశాలకు చిన్నారులను పంపించవలసి వస్తుందని ఇప్పటికైనా ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి స్కూలుకు వెళ్లే రహదారిని మరమ్మత్తులు చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నతాధికారులు కోరుతున్నారు. అదేవిధంగా పట్టణంలోని లడక బజారు లోని సిమెంటు రోడ్డు బురద రోడ్డు గా మారడంతో ప్రజలు రాకపోకలు కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read : గ్రంధాలయంకు రు 1.50కొట్లు మంజూరు

మిషన్ భగీరథ పైప్ లైన్ వేసేందుకు మిషన్ భగీరథ సిబ్బంది గుంటలు తీసి పైపులైన్ వేశారు. ఈ క్రమంలో మట్టి మొత్తం రోడ్డుపైనే వదిలేసి తూతూమంత్రంగా పనులు చేసి వెళ్ళిపోయారు. మట్టి మొత్తం సిమెంట్ రోడ్డు పైనే ఉండిపోవడంతో, చిన్నపాటి వర్షం వచ్చినా రోడ్డు మొత్తం బురదమయంగా మరి ప్రజలు నడవలేని పరిస్థితి నెలకొంది. వెంటనే మున్సిపాలిటీ అధికారులు స్పందించి సిమెంట్ రోడ్ పైన ఉన్న మట్టిని తొలగించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube