ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంతో బలోపేతం చేయాలీ

ఎమ్మెల్సీ విజ్ఞప్తి

1
TMedia (Telugu News) :

ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంతో బలోపేతం చేయాలీ -ఎమ్మెల్సీ విజ్ఞప్తి

టీ మీడియా, మార్చి 31, ఎర్రుపాలెం: ఈ రోజు స్థానిక జెడ్పీఎస్ఎస్ ఎర్రుపాలెం నందు రెండవ దశలో శిక్షణ పొందుతున్న ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆంగ్ల మాధ్యమంను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం ఈ వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీలకు చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల నింపాలని ప్రభుత్వానికి సూచించారు .మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు త్వరలోనే పూర్తవుతాయని తెలియజేశారు .ఈ శిక్షణా తరగతులను ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉపయోగించుకొని వారియొక్క ఆంగ్ల బోధన సామర్థ్యాన్ని పెంచుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చక్కగా ఆంగ్ల మాధ్యమాన్ని బోధించాలని వారు అభిలషించారు.

Also Read : ఆస్పత్రిలో దారుణం రోగి వేళ్లను కొరుక్కుతిన్న ఎలుకలు

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గా భవానీ జిల్లా కార్యదర్శి గీత , ఎర్రుపాలెం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండారు నాగరాజు ,అనుమోలు కోటేశ్వర్రావు ,జిల్లా కార్యదర్శులు రావిరాల లక్ష్మణ్రావు ,మాజీ జిల్లా కార్యదర్శి తాళ్లూరు ఆంజనేయులు ,నండ్రు వెంకటేశ్వర్రావు ,మధిర మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ వినోదరావు ఎస్కే నాగూర్ వలి ,ఎర్రుపాలెం మండల కార్యదర్శులు కె .శ్రీనివాసరావు , డి .మహేంద్ర కుమార్ ,ఎల్. నాగేశ్వరరావు పీడీ చిన్ని బండారుపల్లి రాజారావు ,ఎస్ . వెంకమ్మ , వై. నాగమణి ,పీ. పుష్పావతితదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube