నిరుపేద కుటుంబానికి బాసటగా నిలిచిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

నిరుపేద కుటుంబానికి బాసటగా నిలిచిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

1
TMedia (Telugu News) :

నిరుపేద కుటుంబానికి బాసటగా నిలిచిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

టి మీడియా ,మే 14,ములుగు బ్యూరో: కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న నిరుపేద కుటుంబానికి సహాయం అందించి బాసటగా నిలిచారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్, ములుగు మండలం కాసిందేవిపేట గ్రామానికి చెందిన సామ్యేలు క్యాన్సర్ వ్యాధితో ఇటీవలే మరణించాడు, దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది, విషయం తెలుసుకున్న తస్లీమా వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Also Read : రెజో నెన్స్ హాస్టల్ ఉద్యోగి అనుమానాస్పద మృతి

వారి కుటుంబ పరిస్థితిని చూసిన తస్లీమా చలించిపోయారు, సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యంతో పాటు 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి సహృదయాన్ని చాటుకున్నారు,కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమని అన్నారు, పిల్లల చదువులకు సహకరిస్తానని, అధైర్యపడద్దు మీ కుటుంబానికి సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ అండగా ఉంటుందని తస్లీమా భరోసా కల్పించారు. ఆమె వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్సభ్యులు,గ్రామస్థులు తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube