స‌బ్‌వే స్టేష‌న్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన ప్ర‌ధాని రిషీ సునాక్

స‌బ్‌వే స్టేష‌న్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన ప్ర‌ధాని రిషీ సునాక్

1
TMedia (Telugu News) :

స‌బ్‌వే స్టేష‌న్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన ప్ర‌ధాని రిషీ సునాక్

టీ మీడియా, నవంబర్ 4, లండ‌న్ : బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్ గురువారం లండ‌న్ స‌బ్‌వే స్టేష‌న్‌లో పూలు విక్ర‌యిస్తూ ప్ర‌త్య‌క్షం కావ‌డంతో ప్ర‌యాణీకులు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. ఆఫీసుల‌కు వెళుతున్న ప్ర‌జ‌ల‌కు వెస్ట్‌మినిస్ట‌ర్ ట్యూబ్ స్టేష‌న్‌లో ప్ర‌దాని రిషి సునాక్ ప్లేట్‌లో పూలు అమ్ముతూ క‌నిపించడంతో వారంతా షాక్‌కు గుర‌య్యారు. పేప‌ర్‌తో త‌యారు చేసిన పూల‌ను ఒక్కోటి 5 పౌండ్ల‌కు ఆయ‌న విక్ర‌యించారు. రాయ‌ల్ బ్రిటిష్ లెజియ‌న్ వార్షిక లండ‌న్ పాపీ డే అప్పీల్‌కు నిధుల సేక‌ర‌ణ నిమిత్తం ఆయ‌న ఈ పూల‌ను అమ్ముతూ క‌నిపించారు.

Also read : పారిశుధ్య కార్యక్రమాలు

ఈ కార్య‌క్ర‌మానికి నిధుల సేక‌ర‌ణ‌కు బ్రిటిష్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వాలంటీర్లతో పాటు బ్రిట‌న్ ప్ర‌ధాని సైతం వారితో పాలుపంచుకున్నారు.ప్ర‌ధాని సునాక్ త‌మ కంట‌ప‌డ‌టంతో ప్ర‌యాణీకులంతా ఆయ‌న‌తో స‌న్నిహితంగా మెలుగుతూ ఉత్సాహంగా సెల్పీలు తీసుకున్నారు. భార‌త సంతతికి చెందిన తొలి దేశ ప్ర‌దానితో తాము గ‌డిపిన క్ష‌ణాల‌ను కొంద‌రు త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube