మున్సిపల్ పాలక వర్గానికి శుభాకాంక్షలు

మున్సిపల్ పాలక వర్గానికి శుభాకాంక్షలు

0
TMedia (Telugu News) :

 

celaborations
celaborations

ఖమ్మం: మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సుడా చైర్మన్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్,మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కే.టి.రామారావు, రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గార్ల సహకారంతోనే ఖమ్మం నగర అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. రానున్న రోజుల్లో మరింత ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా మంత్రి అజయ్ కుమార్ గారి సహకారంతో కార్పొరేటర్లు అందరు డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మనులను పొందాలని కోరారు.మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు గా ఎన్నికై సంవత్సర కాలం పూర్తి చేసుకొని అన్ని డివిజన్లను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో పయనింప చేస్తున్న ఖమ్మం నగర కార్పొరేటర్లు అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్.అనంతరం కేక్ కట్ చేసి,నగర మేయర్ నీరజ గారికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు,మంత్రి గారి పి ఎ చిరుమామిళ్ల రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube