ఘనంగా సుబ్రహ్మణ్యస్వామి జన్మదిన వేడుకలు
టీ మీడియా, నవంబర్ 29, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో సుబ్రహ్మణ్యం స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.సుబ్రహ్మణ్యస్వామి షష్టి జన్మదిన వేడుకల సందర్భంగా వనపర్తి పట్టణంలోని గురుస్వాముల ఆధ్వర్యంలో వనపర్తి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గురు స్వాములు అయ్యప్పలు భక్తులు మహిళలు పెద్ద ఎత్తున పట్టణంలోని పురవీధులకుండా ఊరేగింపుగా పాలకాబడిన మోసి మొక్కులు తీర్చుకున్నారు. కాలనీ నుండి ముత్తుకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్పలు ఊరేగింపు బయలుదేరి వెంకటేశ్వర దేవాలయానికి చేరుకున్నారు. అక్కడి నుండి పట్టణంలోని నలుమూలల నుంచి చేరినటువంటి అయ్యప్ప భక్తులు అయ్యప్ప దేవాలయానికి కాలినడకన పాల కావిడి మోస్తూ సుబ్రహ్మణ్యస్వామి నామస్మరణ చేస్తూ వెళ్లారు. అనంతరం అయ్యప్ప గుడిలోని సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, అంగపూజ అష్టోత్తరం పూజలు ఘనంగా నిర్వహించారు.
Also Read : మీ తలనొప్పికి కారణం ఇదేనట
ముత్తుకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ పాల కావడి మోసిన భక్తులు తమ కోరికలను సుబ్రహ్మణ్య స్వామి తీరుస్తాడని నమ్మకం ఉన్నదని గత 15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని వనపర్తిలో నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ గురుస్వామి, నరేందర్ గురుస్వామి, కెవిఆర్ మధు సాగర్ గురుస్వామి, కృష్ణసాగర్ గురుస్వామి, బీచుపల్లి యాదవ్, బాల్రెడ్డి, ఈశ్వర్ గురుస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, చిన్నయ్య, పోతుల రాము, నక్కరాములు, పాపిరెడ్డి నగేష్ అయ్యవారు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.