టీ మీడియా, డిసెంబర్ 9, మహానంది:
మహానంది క్షేత్రంలో గురువారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వల్లిదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, హనుమంతరావు శర్మ శాస్తోృక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.