టీ మీడియా డిసెంబర్ 9 వనపర్తి : సుబ్రహ్మణ్యస్వామి సృష్టి సందర్భంగా గురువారం వనపర్తి 30వవార్డు న్యూటౌన్ కాలనీ నుండి ముత్తుకృష్ణ గురు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అయ్యప్ప దేవాలయంలోని సుబ్రమణ్య స్వామి గుడి వరకు పాల కావడితో ఊరేగింపుతో వెళ్లారు. పట్టణ నలుమూలల నుండి దాదాపు రెండు వందల మంది పాల కావడి మోశారు. అనంతరం అయ్యప్ప దేవాలయంలోని సుబ్రహ్మణ్య స్వామికి అంగపోజ అభిషేకం అష్టోత్తరంతో ఘనంగా పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముత్తుకృష్ణ గురు స్వామి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.పెళ్లి కాని వారు కోరిక ఉన్నవారు స్వామి వారు అనుగ్రహించి వారి కోరికలను తీరుస్తారని విశ్వాసం నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు నరేందర్ కాగితాల, లక్ష్మీనారాయణ, వెంకన్న కృష్ణ, సాగర్, బీచ్పల్లి యాదవ్, ఆనంద్, మధు, ఆంజనేయులు, గోపాల్ దిన్నె బాల్ రెడ్డి, ఈశ్వర్ ,రమేష్ శర్మ ,మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొని శోభాయాత్ర ను ప్రారంభించారు.
