మానవ రహిత యుద్ధ విమాన ప్రయోగం విజయవంతం

మానవ రహిత యుద్ధ విమాన ప్రయోగం విజయవంతం

1
TMedia (Telugu News) :

మానవ రహిత యుద్ధ విమాన ప్రయోగం విజయవంతం

టి మీడియా ,జులై 2,బెంగళూరు: సాంకేతికత విస్తృతంగా అందుబాటులోకి వస్తోన్న తరుణంలో భవిష్యత్తు యుద్ధాలు కేవలం యంత్రాల మధ్యే జరుగుతాయని తేలిపోయింది. ఫలితంగా ప్రపంచంలోని సూపర్‌ పవర్‌ దేశాలు ఇప్పుడు మానవరహిత యుద్ధ వాహనాలపై దృష్టిపెట్టాయి. భారత్‌ కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే మానవ రహిత యుద్ధ విమానాలపై పరిశోధనలు ప్రారంభించిన భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) తాజాగా అరుదైన ఘనత సాధించింది. స్వదేశీ పరిజ్ఞానమైన ఆటోనామస్‌ ఫ్లయింగ్‌ వింగ్‌ టెక్నాలజీ ఆధారంగా తొలి విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది.

Also Read : విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిరసన

కర్ణాటకలోని చిత్రదుర్గ్‌లో గల ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌లో ఈ మానవరహిత విహంగాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది. పూర్తి స్వయంచలితంగా ఎగిరే ఈ యుద్ధ విమానం కచ్చితమైన ఎత్తులో టేకాఫ్‌ అవడంతో పాటు నావిగేషన్‌, స్మూత్‌ టచ్‌డౌన్‌ వంటివి సమర్థంగా నిర్వహించుకుందని తెలిపింది. ఈ విమానాన్ని డీఆర్‌డీఓకు చెందిన ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ డిజైన్‌ చేసి అభివృద్ధి చేసింది. ఇందులో చిన్న టర్బోఫ్యాన్‌ ఇంజిన్‌ ఉంది. ఇందులో ఉన్న ఎయిర్‌ఫ్రేమ్‌, అండర్‌క్యారేజ్‌, నియంత్రణ వ్యవస్థ అంతా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినదే.

 

Also Read : ప్రజా అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్

భవిష్యత్తు మానవ రహిత యుద్ధ విమానాలను రూపొందించే దిశగా కీలక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఈ విమానం కీలక మైలురాయిగా మారనుందని డీఆర్‌డీఓ వెల్లడించింది. అంతేగాక, వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలో స్వావలంబన సాధించేందుకు ఇదో కీలక ముందడుగుగా అభివర్ణించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ డీఆర్‌డీఓను అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube