భార్య చూస్తుండగానే బిల్డింగ్‌పై నుంచి దూకిన భర్త
-ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
టీ మీడియా, ఫిబ్రవరి 7,హైదరాబాద్ : భార్య చూస్తుండగానే భర్త బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పచ్చనిసంసారాన్ని కూలుస్తూ.. నిండు జీవితాన్ని కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలోని కమ్మునూరు గ్రామానికి చెందిన రేవన్ సిద్ధప్ప బ్రతుకుదెరువు కోసం భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చాడు. నగర శివారు రాజేంద్ర నగర్ పరిధిలోని బండ్లగూడ అక్బర్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. సిద్ధప్పకు ఉదయం భార్యతో చిన్నపాటి గొడవ జరిగింది. దంపతులిద్దరూ మాటా మాటా అనుకున్నారు. దీంతో క్షణికావేశానికి గురైన సిద్ధప్ప భార్య చూస్తుండగానే నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ మూడో అంతస్తుకు చేరుకున్నాడు. ఇక్కడి నుంచి దూకి చనిపోతానంటూ భార్యను హెచ్చరించాడు.