కొడుకు మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

కొడుకు మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

1
TMedia (Telugu News) :

కొడుకు మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

టి మీడియా,జూలై 29,మెదక్: జిల్లాలోని రామాయంపేటలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు మృతి తట్టుకోలేక ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామాయంపేటకు చెందిన వరలక్ష్మి, శివకుమార్‌ తల్లీ కొడుకులు. ప్రేమ విఫలమవడంతో శివకుమార్‌ మూడు రోజుల క్రితం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతితో వరలక్ష్మి తీవ్రమనస్థాపానికి గురైంది.

Also Read : టీడీపీ నేత ఇంట్లో దొంగతనం..

అయితే శివకుమార్‌ మృతిని తట్టుకోలేక శుక్రవారం ఉదయం చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులోనుంచి ఆమె మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube