విధులనుండి తొలగించారని నీళ్ల ట్యాంక్ ఎక్కిఆత్మహత్యయత్నం

విధులనుండి తొలగించారని నీళ్ల ట్యాంక్ ఎక్కిఆత్మహత్యయత్నం

2
TMedia (Telugu News) :

విధులనుండి తొలగించారని నీళ్ల ట్యాంక్ ఎక్కిఆత్మహత్యయత్నం

టీ మీడియా, మే 11, జన్నారం:గ్రామపంచాయతీ విధుల నుండి తొలగించారని సపాయి , సఫాయి కుటుంబ సభ్యులు నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యయత్నంకు ప్రయత్నించా రు. జన్నారం మండలంలోని మహమ్మదాబాద్ గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ విధులు నిర్వహిస్తున్న సపాయి కొండ్ర రాజన్నను గ్రామ పంచాయతీ అధికారులు విధులనుండి తొలగించి ,మరోవ్యక్తిని సపాయిగా నియమించినందుకు మంగళవారం రోజున రాజన్న కుటుంబ సభ్యులతో కలసి గ్రామం లోని నీళ్ల ట్యాంక్ ఎక్కి నాకు న్యాయం చేయాలని లేని యెడల కుటుంబంతో సహా ట్యాంక్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు.

Also Read : నిరుద్యోగులకు శిక్షణ లు ఏర్పాటు చేయాలి

ఇన్ని సంవత్సరాలుగా పంచాయతీ పని చేసుకుంటు కుటుంబాన్ని పోషించుకుంటున్నాని ఇప్పుడు విధులునుండి తొలగిస్తే నా కుటుంబం రోడ్డున పడుతుంది అని నాకు న్యాయం చేస్తేనే ట్యాంక్ పై నుండి దిగి వస్తా నని లేకుంటే అందరం ఆత్మహత్య చేసుకుంటామ ని అనడంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ సతీష్ కుమార్ సంఘ టన స్థలానికి చేరు కుని వారికి సర్ది చెప్పడంతో ట్యాంక్ పై నుండి దిగి వచ్చారు. ఈ విషయంపై స్థానిక పంచాయతీ కార్య దర్శి తోట మహేష్ ను వివరణ కోరగా సపాయిగా పనిచేస్తున్న కొండ్ర రాజన్న వయస్సు 65 సంవత్స రాలు దాటిందని దానితో గ్రామ సభలో తీర్మానం చేసి ఆయనను విధుల నుండి తొలగించి మరో వ్యక్తిని నియ మించమని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube