మండిపోతున్నఎండలు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే

పాటించకపోతే ప్రాణాలకే ప్రమాదం

1
TMedia (Telugu News) :

మండిపోతున్నఎండలు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే
-పాటించకపోతే ప్రాణాలకే ప్రమాదం
టీ మీడియా, మార్చి 31, హైద‌రాబాద్ సిటీ :భానుడు భగభగమంటున్నాడు..తన ప్రతాపంతో గ్రేటర్‌లో నిప్పులవాన కురిపిస్తున్నాడు. ఉగాదికి ముందే మండిపోతుండడంతో బయటకెళ్లాలంటే దడ పుడుతోంది. బుధవారం గ్రేటర్‌లో గరిష్ఠం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాగల ఐదు రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీచేశారు. భానుడు భగభగ మండుతున్నాడు. ఒంట్లో నీటినే కాదు.. సత్తువనూ పీల్చేస్తున్నాడు. అడుగు బయటపెట్టాలంటే ఠారెత్తించే ఎండ.. భరించలేనంత ఉక్కపోత.. చెప్పలేనంత నీరసంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నగరంలో 38డిగ్రీల సెల్సియస్‌పైనే ఉష్ణోగ్రత నమోదవుతున్నది. ఈ పరిస్థితుల్లో వేసవి నుంచి గట్టెక్కాలంటే జాగ్రత్తలు తప్పనిసరి.

Also Read : పెట్రో ధ‌ర‌ల పెంపుపై కేటీఆర్ ఫైర్

నీటిని ఎక్కువగా తాగాలి
ప్రతీరోజు 4 లీటర్ల నీళ్లు కనీసంగా తీసుకోవాలి. ఎండ తీవ్రంగా ఉన్న సమయాల్లో బయటకు రాకపోవడమే మంచిది. ఆ సమయాల్లోని పనులు వాయిదావేసుకోవడం ఉత్తమం. శరీరాన్ని చల్లబరిచే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా గొడుగు తీసుకెళ్లాలి. పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకూడదు. వేడిగాలులతో ఇంట్లో కూడా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. పండ్ల రసాలు తరుచూ తీసుకోవడం ఉత్తమం.
జాగ్రత్తలు
వేసవిలో పుచ్చకాయ ఆరగించాలి. ఇందులో నీటి శాతం ఎక్కువ కావడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్యపోతుంది.
తాటిముంజలు శరీరంలో నీటిశాతం తగ్గకుండా చేస్తాయి. ఒంట్లో వేడి తగ్గి మలబద్దకం తగ్గుతుంది.
కీరా వేసవిలో తప్పకుండా తీసుకోవాలి. శరీరంలో విషపదార్థాలు బయటకు పోతాయి. మరోముఖ్యమైన పండు ద్రాక్ష. ఇందులో మినరల్స్‌, విటమిన్లు పుష్కలం.
మజ్జిగ కూడా ప్రధానమైనదే. దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరం చేస్తుంది.
కొబ్బరినీళ్లు, చెరుకు రసం, మజ్జిగ, లస్సీ, పళ్ల రసాలు, నిమ్మరసాలు వంటి సోడియం, పొటాషియం ఉండే డ్రింక్స్‌ తాగితే లాభం ఎక్కువగా ఉంటుంది.వేసవి తాపాన్ని తీర్చేవి కచ్చితంగా నీళ్లే. గంటగంటకు నీళ్లు తాగాలి. చల్లగా ఉండే నీళ్లు తాగకూడదు.చలువ చేసే ఫుడ్స్‌ ఎక్కువగా తినాలి. నిల్వ పచ్చళ్లు, ఉప్పు కారాలు, మసాలాలు తగ్గించాలి.
గ్రేటర్‌కు ఎల్లో హెచ్చరిక

Also Read : ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు పొడిగింపు ఎప్రియల్ 15 తుది గడువు

మార్చి చివరిలోనే రికార్డు స్థాయిలో 40.2 డిగ్రీలు నమోదు
రాగల ఐదు రోజులు మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
అత్యవసరమైతే తప్పా మధ్యాహ్నం బయటకు రావొద్దు.గ్రేటర్‌లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి చివరిలోనే ఉష్ణోగ్రతలు 40 దాటడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరంలో బుధవారం రికార్డు స్థాయిలో మధ్యాహ్నం వరకే 40.2డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాగల మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలుండడంతో గ్రేటర్‌కు ఎల్లో హెచ్చరికలు జారీచేశారు. అత్యవసరమైతే తప్పా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల్లోపు బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని సూచించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube