వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోండి

ఎర్రబెల్లి

1
TMedia (Telugu News) :

వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోండి: ఎర్రబెల్లి
టి మీడియా, ఎప్రిల్22,హైదరాబాద్: వేసవిలో మంచి నీటి సమస్యలు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్, గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. నీటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సంబంధిత అధికారులు, సర్పంచులతో హైదరాబాద్ మిషన్ భగీరథ కార్యాలయం నుండి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు నిర్ణీత నీటిని అందరికీ అందేలా సర్వసన్నద్ధంగా ఉండాలని అన్నారు. నీటి సరఫరా పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సమస్యలను పరిష్కరిస్తూ, సమన్వయం చేస్తూ, తగిన విధంగా అధికారులు పని చేయాలని అన్నారు. నీటి నిల్వలు ఉంచుకోవాలి. పంపుల నిర్వహణ, లికేజీలు లేకుండా చూసుకోవడం, ఫిల్టర్ బెడ్ల క్లీనింగ్, సమస్యలు ఉత్పన్నం అయితే, ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

 

Also Read : సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్యపై సీబీఐ విచార‌ణ హైకోర్టు ను ఆశ్రయించిన బీజేపీ నేతలు

 

ఈ సందర్భంగా సర్పంచుల నుంచి ఆయా గ్రామాల మంచినీటి సరఫరా పై ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడిన సర్పంచులు నీటి సరఫరా అద్భుతంగా ఉందని చెప్పారు.కొందరు మారు మూల గ్రామాల సర్పంచులు అక్కడక్కడ కొన్ని లీకేజీలు ఉన్నాయని తెలిపారు.ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి అధికారులను అదేశించారు.ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా, లేకుండా నూటికి నూరు శాతం నీటిని అందించి సీఎం కేసిఆర్ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని మంత్రి అదేశించారు.అలాగే సర్పంచులు కూడా ఎప్పటికప్పుడు తమ సమస్యలను అధికారుల దృష్టికి తేవాలని సూచించారు.అప్పటికీ పరిష్కారం దొరకక పోతే తమ దృష్టికి తేవాలని మంత్రి చెప్పారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, సీఎం, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఈ లు, ఎస్ఈ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube