వలసదారుల అడ్డుకట్టకు సునాక్‌ కొత్త బిల్లు

వలసదారుల అడ్డుకట్టకు సునాక్‌ కొత్త బిల్లు

0
TMedia (Telugu News) :

వలసదారుల అడ్డుకట్టకు సునాక్‌ కొత్త బిల్లు

టీ మీడియా, మార్చ్ 9, లండన్‌ : బ్రిటన్‌కు అక్రమంగా వలస వస్తున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌ కొత్త బిల్లు తెచ్చారు. వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో వారిని శరణార్థులుగా పరిగణించమని ఆయన తెలిపారు. ఇల్లీగల్‌ మైగ్రేంట్‌ బిల్లుతో ఇక నుంచి శరణార్థుల అక్రమ వలసలకు అడ్డుకట్ట పడుతుందని వెల్లడించారు. ‘మీరు కనుక మా దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే ఇక నుంచి మిమ్మల్ని శరణార్థులుగా పరిగణించం, మీకు గతంలోలాగా బానిసత్వ రక్షణ ప్రయోజనాలు లభించవు. అలాగే మీరు నకిలీ మానవ హక్కుల దావాలు వేసుకోలేరు. అసలు మీరు ఇక్కడ ఉండలేరు’ అని పేర్కొన్నారు. ఈ కొత్త బిల్లును హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి.

Also Read : నాగాలాండ్‌, మేఘాలయ సిఎంలుగా నెయిఫియు, కొన్రాడ్‌ల ప్రమాణస్వీకారం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube