సీఎం కేసీఆర్ వ‌ల్లే ప్ర‌తి ఇంటికి మంచినీటి స‌ర‌ఫ‌రా సాధ్య‌మైంది

సీఎం కేసీఆర్ వ‌ల్లే ప్ర‌తి ఇంటికి మంచినీటి స‌ర‌ఫ‌రా సాధ్య‌మైంది

0
TMedia (Telugu News) :

సీఎం కేసీఆర్ వ‌ల్లే ప్ర‌తి ఇంటికి మంచినీటి స‌ర‌ఫ‌రా సాధ్య‌మైంది

– మంత్రి కేటీఆర్

టీ మీడియా, అక్టోబర్ 12, హైద‌రాబాద్ : స్వ‌తంత్ర భార‌త‌దేశంలో ప్ర‌తి ఇంటికి తాగునీటి క‌నెక్ష‌న్‌ను అందించేందుకు మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. దేశంలో ప్ర‌తి ఇంటికి మంచినీటి స‌ర‌ఫ‌రా అందించిన రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను ది ఇండియ‌న్ ఇండెక్స్ అనే సంస్థ ట్వీట్ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ మొద‌టి స్థానంలో నిలిచింది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ అగ్ర‌స్థానంలో ఉండ‌టంపై కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ రీట్వీట్ చేశారు కేటీఆర్. విజ‌న్ ఉన్న కేసీఆర్ తెలంగాణ‌కు సీఎంగా ఉండ‌టం వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని మంత్రి పేర్కొన్నారు.

Also Read : అనుమతి లేని నిర్మాణం లు

ఈ ప‌థ‌కం తెలంగాణ‌లో విజ‌య‌వంత‌మైన త‌ర్వాతే కేంద్ర ప్ర‌భుత్వం హ‌ర్ ఘ‌ర్ జ‌ల్ అనే ప‌థ‌కాన్ని తీసుకొచ్చింద‌ని తెలిపారు. ఇవాళ తెలంగాణ ఏది చేస్తే మిగిలిన రాష్ట్రాలు అనుస‌రిస్తున్నాయ‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube