టి ఆర్ఎస్ శ్రీనివాస్ యాదవ్
టీ మీడియా, డిసెంబర్ 30, చర్ల :
చర్ల మండలం పరిధిలో గల గుంపెన గూడెం గ్రామంలో నాయి బ్రాహ్మణ కులానికి చెందిన తోటపల్లి రాంబాబు తండ్రి గురుమూర్తి, నాగమణి దంపతులు గత 15 సంవత్సరాల నుండి తేగడ గ్రామం నుండి వచ్చి కులవృత్తి బార్బర్ పని చేసుకుంటూ గ్రామంలో ఒకడై కలిసి మెలసి జీవిస్తున్నారు. తోటపల్లి రాంబాబు తండ్రి గురుమూర్తి భార్య నాగమణి కి అనారోగ్య కారణంగా రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని డాక్టర్లు సూచించారు. పేద నిరుపేద కుటుంబం అయిన రాంబాబు కుటుంబానికి గుంపెనగుడెం గ్రామ యాదవ సంఘం తరఫున యాదవ సంఘం జిల్లా నాయకులు, టిఆర్ఎస్ పార్టీ చర్ల మండల కార్యదర్శి నక్కినబోయిన శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రూ 34,100.00 ఆర్థిక సాయం చేసారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు బంటు వెంకన్న , మెంతుల సత్యనారాయణ, శరబోయిన నారాయణ,
పోలిబోయిన నాగేశ్వరావు, గోసుల నరసింహారావు, గోళ్ళ నాగరాజు, పుచ్చకాయలు పాపారావు, పంకు వెంకట్, మర్లపాటి బాబు, బంటు ఏడు కొండలు, యాదాల రాంబాబు, మెంతుల నాగరాజు, కొప్పుల ప్రసాద్, గోళ్ళ నవీన్, బంటు రవీంద్ర తదతురులు అందరించారు.