కొత్త వారికి ఆసరా పింఛన్లు వెంటనే ఇవ్వాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 27 వనపర్తి : టిఆర్ఎస్ ఎన్నికల హామీ 57 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్లు వెంటనే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేసీఆర్ 2018 ఎన్నికలు 50 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అవి నేటికి ఆచరణకు నోచుకోలేదు. కేసీఆర్ మాటలు నమ్మే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. కానీ వీళ్ళు పెన్షన్ మాట దేవుడెరుగు కానీ నేటికీ దరఖాస్తుల పరిశీలన కూడా జరగడం లేదు. అన్ని డబల్ బెడ్ రూములు పథకం, మూడు ఎకరాల భూమి పథకం, నిరుద్యోగ భృతి పథకం లాగానే ఇది కూడా ఉత్తుత్తి హామీ ఇచ్చినట్టు ఉంది అన్నారు .కెసిఆర్ మాటలు నమ్మి షుగర్ బీపీ ఉన్న వయోవృద్ధులు పెన్షన్లు వస్తాయనే ఎదురు చూస్తున్నారు. కాబట్టి కెసిఆర్ మాట ఇచ్చిన ప్రకారం వెంటనే 50 ఏళ్లు నిండినవారు అందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా 2018 ఎన్నికల నాటి నుంచి 60 ఏళ్లు నిండిన వారు 10 లక్షల మంది ఆసరా పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

వారికి కూడా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని నందిమల్ల అశోక్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఎన్నికల కోసం అక్కడ మాత్రమే 2200 మందికి పెన్షన్లు అందజేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వయోవృద్ధుల పైన కెసిఆర్ పక్షపాతం చూపాడని తెలుగు దేశం తీవ్రంగా ఖండించింది. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వృద్ధులకు పెన్షన్లు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నందిమల్ల అశోక్, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి నందిమల్ల శారద, ప్రచార కార్యదర్శి తెలుగు యువత ఇంచార్జి బాలునాయుడు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube