ఇజ్రాయెల్ వెన్నంటి నిలుస్తాం

ఉగ్ర‌వాదంపై పోరుకు మ‌ద్ద‌తు

0
TMedia (Telugu News) :

ఇజ్రాయెల్ వెన్నంటి నిలుస్తాం..

-ఉగ్ర‌వాదంపై పోరుకు మ‌ద్ద‌తు

– బ్రిట‌న్ ప్ర‌ధాని రిషీ సునాక్‌

టీ మీడియా, అక్టోబర్ 19, టెల్ అవివ్ : పాల‌స్తీనా ఉగ్ర సంస్ధ హ‌మాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్ర‌తిదాడుల‌తో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్‌లో బ్రిట‌న్ ప్ర‌ధాని రిషీ సునాక్ గురువారం అడుగుపెట్టారు. హ‌మాస్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు తాము పూర్తి బాస‌ట‌గా నిలుస్తామ‌ని ఈ సంద‌ర్భంగా రిషీ సునాక్ భ‌రోసా ఇచ్చారు. ఉగ్ర‌వాదమ‌నే దుష్ట‌శ‌క్తితో పోరాడుతున్న మీకు సంఘీభావం తెలుపుతున్నామ‌ని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావ‌ర‌ణం, హ‌మాస్ దాడుల గురించి ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెతన్యాహు, అధ్య‌క్షుడు ఇసాక్ హెర్జోగ్‌తో రిషీ సునాక్ సంప్ర‌దింపులు జ‌రుపుతారు. కాగా, హమాస్‌ తీవ్రవాద దాడులను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌లో బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పర్యటించిన విషయం తెలిసిందే.

Also Read : కేసీఆర్‌ అవినీతి పక్క రాష్ట్రాలకు విస్తరించిది

ఈ సందర్భంగా బైడెన్‌.. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమయ్యారు. యుద్ధ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube