ప్రజా సంఘర్షణ దీక్షకు మద్దతు ఇవ్వండి

1
TMedia (Telugu News) :

ప్రజా సంఘర్షణ దీక్షకు మద్దతు ఇవ్వండి

టీ మీడియా, ఏప్రిల్ 28 వనపర్తి, బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ నెల 29న నిర్వహించబోతున్న ప్రజా సంఘర్షణ దీక్షకు మద్దతు ఇవ్వాలని అఖిల పక్ష నాయకులు కోరారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్గౌడ్ తో చర్చలు జరిపిన అఖిలపక్ష నాయకులు కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, బాలరాజ్ తదితరులు పట్టణ సమస్యలను వీరోచితంగా పోరాడి ఇంకొకరికి ఆదర్శం అవుతున్నా మీకు కానీ సమస్యలపై పోరాడే మరెవరికైనా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని 29 తారీకు శుక్రవారం రోజున మీరు జరిపే దీక్షకు మద్దతు సంపూర్ణంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ టిపిసిసి సభ్యులు శ్రీనివాస్గౌడ్ సంయుక్తంగా తెలిపారు.

Also Read:జాతీయ జెండాను అవమానించిన నాయకులు

ఈ సందర్భంగా మాకు మద్దతు తెలిపిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువత అధ్యక్షులు శివసేనరెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందిమల్ల అశోక్, పార్లమెంటరీ అధ్యక్షులు రాములు, బిఎస్పి జిల్లా అధ్యక్షుడు చెన్న రాములు, సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి చంద్రయ్య, ప్రజా పార్టీ రాష్ట్ర నాయకులు మురళీధర్ గుప్త, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నరసింహరెడ్డికి, సిపిఎం కార్యదర్శి జబ్బార్, ప్రజా సంఘాలు, రైతు సంఘాలకు, యువజన సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, అఖిలపక్షం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సంఘర్షణ దీక్షను విజయవంతం చేయాలని అఖిలపక్షం తరఫున కోరారు.

Also Read:భార్యను కత్తితో పొడిచిన్న భర్త

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube