సార్వత్రిక సమ్మెకు మద్దతు

3 న ఖమ్మం లో ఉచిత వివాహ పరిచయ వేదిక

2
TMedia (Telugu News) :

సార్వత్రిక సమ్మెకు మద్దతు
-3 న ఖమ్మం లో ఉచిత వివాహ పరిచయ వేదిక
-జాతీయ మహాసభ కు ఏర్పట్లు

ఏఐ బి ఎస్ ఎన్ నిర్ణయం

టి మీడియా,మార్చి 28,ఖమ్మం: దేశవ్యాప్తంగా ఉద్యోగ ,కార్మిక సంఘాలు సోమ,మంగళవారం నిర్వహించే సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలపాలని ,అర్చక,ఉద్యోగులు కూడా సమ్మె లో పాల్గొనాలని అఖిలబారత బ్రాహ్మణ (సర్వీస్)నెట్ వర్క్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పిలుపు నిచ్చింది.సమ్మె అనేది భారత దేశ మనుగడ కోసం ఆని అభిప్రాయ పడింది. పరిమి అనంత లక్ష్మీ అధ్యక్షత న ఖమ్మం కేంద్ర కార్యాలయంలో ఆదివారం అందుబాటులో ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ అత్యవసర సమావేశం జరిగింది..ఎప్రియల్ 3న ఖమ్మం లో నెట్వర్కు జాతీయ స్థాయి కమిటీ సమావేశం జరపాలని,సాయింత్రం జాతీయ స్థాయిబ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించాలని నిర్ణయం జరిగింది.పెట్రో, డీజిల్,గ్యాస్ దరాలు పెంపు వల్ల బ్రాహ్మణ వృత్తి దారులు,ముఖ్యంగా అర్చకత్వం,వంట పని బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందుల లు ఎదుర్కొంతుVన్నారని అన్నారు.అన్ని స్థాయి కమిటీ ల్లో చేయాల్సిన మార్పులు గురించి సమావేశం చర్చించింది.కొత్త ప్రతిపాదనలు కు 3 వతేదీ సమావేశం లో ఆమోదంతీసుకొనినియామకాలు అందచేయాలని నిర్ణయం చేశారు.

Also Read : ఎంపీ నామ చొరవతో రూ. 3 లక్షల రూపాయల చెక్కు మంజూరు

బెస్ట్ గడువు పెంచాలి

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా అమలు అవుతున్న బెస్ట్ స్కీం దరఖాస్తులు గడువు పెంచాలని సమావేశం ఉన్నతాధికారులు ను కోరింది.సెలవులు, సమ్మె మూలంగా ప్రభుత్వ పనిధినాలు తగ్గాయని అన్నారు.ఈ విష్యం పై వినతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ స్కీం క్రింద ఇప్పటికే ఎంపిక చేసిన వారి ఖాతాల్లో తక్షణమే నిధులు జమ చెయ్యాలి అని సమావేశం కోరింది.సమావేశం లో ఎస్ మురళీ కృష్ణ,డి ఫణిశర్మ, వల్లూరి రంగారావు, రావులపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube