వీఆర్ఏ ల సమ్మెకు మద్దతు

వీఆర్ఏ ల సమ్మెకు మద్దతు

0
TMedia (Telugu News) :

వీఆర్ఏ ల సమ్మెకు మద్దతు

టి మీడియా, జూలై 29,బూర్గం పహాడ్ : జూలై 29 : రాష్ట్ర వ్యాప్తంగా వి.ఆర్ . ఏ లు చేస్తున్న నిరవధిక సమ్మే లొ భాగంగా భూర్గం పహాడ్ మండలంలో సమ్మే చేస్తున్న వి.ఆర్. ఏ లకు నేడుసి.పి.యం. పార్టీ మండల కమిటి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా మండల కార్య దర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లా డుతూ … వి.ఆర్. ఏ ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని . . 2020 లొ హామీ ఇచ్చిన మేరకు పే స్కేల్ సంబంధించిన జి. ఒ. ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

Also Read :టీడీపీ నేత ఇంట్లో దొంగతనం..

కే సి ఆర్ ప్రభుత్వం గతం లో అనేక వాగ్దానాలు చేసిందని వాటిని అమలు చెయ్య లేదని గుర్తుచేశారు. ఇలాంటి ప్రజా పోరాటాలకు సి.పి. యం . పార్టీ అండదండలు ఎల్లప్పుడు ఉంటాయని తెలియ జేశారు. ఈ కార్యక్రమం లొ పార్టీ సభ్యులు బయ్యా రాము బర్ల తిరపత రావు కొమ్రరాజు సత్యనారాయణ నిమ్మల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube