వాల్మీకుల దీక్షకు మద్దతు తెలిపిన వైస్ చైర్మన్
టీ మీడియా, నవంబర్ 24, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర నిర్వహిస్తున్న వాల్మీకుల దీక్షకు వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ 15వ రోజు గురువారం మద్దతు ప్రకటించారు. వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ మీరు చేసేటువంటి దీక్ష న్యాయపరమైనది మీకు పూర్తి మద్దతు నా వంతుగా ఉంటదని చెప్పడం జరిగింది. అలాగే మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దృష్టిలో ఉంది. గనుక మరొకసారి మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది.
Also Read : అవినీతి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి
వాల్మీకులను ఎస్టీలో కలపడానికి తెలంగాణ ప్రభుత్వం కృతనిక్ష ఎంత ఉందని అందులో భాగంగా చెల్లప్ప కమిటీని ఏర్పాటు చేసి నివేదికను కేంద్రానికి పంపిన ఘనత కేసిఆర్, తెలంగాణ ప్రభుత్వాన్ని గాని కానీ కేంద్ర ప్రభుత్వం కుంటి సాకులతో దాన్ని వెనక్కి తిప్పి పంపిందని మరొక్కసారి రాష్ట్ర క్యాబినెట్ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నివేదిక పంపడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి అనేకసార్లు వాల్మీకుల సమస్యల పైన ముఖ్యమంత్రితో చర్చించడం వాల్మీకుల రాష్ట్ర సంఘ నాయకులను ముఖ్యమంత్రికి కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు, వేణుగోపాల్ నాయుడు, టీకే కురుమన్న, నీలస్వామి, రాష్ట్ర మార్క్ పేడ్ డైరెక్టర్ విజయకుమార్, వెంకటయ్య, పెద్దముక్కల రవి, నరేష్ కుమార్, తుమ్మల రాములు, నాయుడు, శ్రీరంగాపురం మండల అధ్యక్షులు సంపత్ కుమార్, వెంకటేష్ నాయుడు, ధర్మరాజు,నరేష్ నాయుడు, నాగవరం వాల్మీకి సంఘ నాయకులు, అధ్యక్షులు సంపత్ కుమార్, చిన్న రాములు, రామస్వామి, వెంకటయ్య,కేశవులు, మన్యం తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube