గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి సుప్రీం క్లీన్ చిట్
గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి సుప్రీం క్లీన్ చిట్
గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి సుప్రీం క్లీన్ చిట్
టి మీడియా,జూన్ 24,న్యూఢిల్లీ: 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్ల కేసులో గతంలో మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ తోసిపుచ్చింది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. సిట్ ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. సిట్ తీర్పును ఆమోదిస్తూ మెజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్ధిస్తున్నామని, ఈ కేసులో దాఖలైన నిరసన పిటీషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది.
Also Read : హస్తినకు చేరుకున్న ద్రౌపదీ ముర్మూ
2021, డిసెంబర్ 8వ తేదీన ఈ కేసులో విచారణ పూర్తి అయ్యింది. అయితే సుప్రీం తన తీర్పును ఇవాళ వెలువరించింది. గుజరాత్ అల్లర్ల సమయంలో కాంగ్రెస్ ఎంపీ ఈషాన్ జఫ్రీ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సిట్ తీర్పును 2017లో గుజరాత్ హైకోర్టు సమర్ధించింది. గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. మోదీతో పాటు ఇతర రాజకీయవేత్తలు, అధికారులపై 2006లో జాకియా జఫ్రీ కేసును నమోదు చేసింది. 2008లో అల్లర్లపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube