మనీష్ సిసోడియాకు బెయిల్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
మనీష్ సిసోడియాకు బెయిల్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
మనీష్ సిసోడియాకు బెయిల్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
టీ మీడియా, అక్టోబర్ 30, న్యూఢిల్లీ : ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టులో చుక్కుదురైంది. మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ ఎన్ భట్టితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. లిక్కర్ స్కాం కేసులో నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ ఆధారాలు చూపించండంతో అత్యుతన్నత న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రూ.338 కోట్ల నగదు బదిలీకి సంబంధించిన అంశాన్ని ఈడీ సుప్రీం ముందు ఉంచింది. ఇక ఈ లిక్కర్ స్కాం కేసులో విచారణను పూర్తి చేసేందుకు ఈడీకి సుప్రీంకోర్టు 6 నుంచి 8 నెలల సమయం ఇచ్చింది.
Also Read : అమెరికాలో 18 మందిని చంపిన హంతకుడు ఆత్మహత్య
విచారణ నెమ్మదిగా సాగితే మూడు నెలల లోపు సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందుతారని సుప్రీం పేర్కొంది. కాగా కొన్ని నెలల క్రితం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube