సుప్రీం కోర్టు చేసిన సిఫారసు కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలి

సుప్రీం కోర్టు చేసిన సిఫారసు కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలి

1
TMedia (Telugu News) :

సుప్రీం కోర్టు చేసిన సిఫారసు కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలి

టీ మీడియా, ఆగస్టు 10, వనపర్తి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి లేదా సుప్రీం కోర్టులో ఏడుగురు లేదా మంది ధర్మాసనం ఏర్పాటు చేసి వర్గీకరణ అమలుకు మార్గం సుగమం చేయాలి. మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో దశాబ్దాలుగా ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటంలో మొట్టమొదటి సారిగా మద్దతు ప్రకటించి అండగా నిలిచిన బీజేపీ పార్టీ నాయకులు అనేక సభలలో సమావేశాలలో అనుకూలంగా ప్రతిపక్ష హోదాలో లేఖలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధానంగా కనిపించిన రెండు అంశాలు ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆయితే మరోకటి ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తాం అని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాకా నేటికీ ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ పై స్పందించని కేంద్ర ప్రభుత్వంపై ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టాలి అని గత నెల 20వ తారీకు నుండి నిన్నటి వరకు రిలే నిరహార దీక్షలు కొనసాగించడం జరిగింది.

 

Also Read : పొనకల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వన మహోత్సవం

 

ఈ వర్షాకాల సమావేశాల్లో బిల్లు ప్రస్తావన తీసుకురావడంలో విఫలం చెందిన భాజపా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపి జిల్లా కలెక్టర్ షేక్ యాష్మిన్ బాషా కి ఎస్సి వర్గీకరణ చట్టబద్దతకు ఉన్న అవకాశాలను తెలుపుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలోసిరువాటి శ్రీను బుడగ జంగల సంఘం రాష్ట్ర అధ్యక్షులు,కొమ్ము చెన్నకేశవులు మాదిగమాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా సీనియర్ నాయకులు, ఏడవల్లీ భాస్కర్ఎ స్సీ ఉప కులాల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు,గువ్వల యాదగిరి మాదిగ యువకవుల వేదిక జిల్లా అధ్యక్షులు, వెంకటాపురం గోవింద్ మాదిగ, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి, మీసాల నాగరాజు మాదిగ,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా సీనియర్ నాయకులు,గంధం శ్రీకాంత్ మాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా నాయకులు, సీరిగిరి విరేష్ బుడగ జంగాల సంఘం రాష్ట్ర కోఆర్డనేటర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube