మహువా పిటిషన్‌ను తిరిగి జాబితా చేసిన సుప్రీంకోర్టు

మహువా పిటిషన్‌ను తిరిగి జాబితా చేసిన సుప్రీంకోర్టు

0
TMedia (Telugu News) :

మహువా పిటిషన్‌ను తిరిగి జాబితా చేసిన సుప్రీంకోర్టు

టీ మీడియా, డిసెంబర్ 15, న్యూఢిల్లీ : టిఎంసి నేత మహువా మొయిత్రా పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారం వచ్చే ఏడాది జనవరి 3కి తిరిగి జాబితా చేసింది. తప్పుడు ఆరోపణలతో లోక్‌సభ నుండి తనను బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయమే ఫైల్‌ వచ్చిందని, దాన్ని పరిశీలించేందుకు సమయం లేదని ధర్మాసనానికి అధ్యక్షత వహించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేర్కొన్నారు. తాను స్వయంగా ఫైల్‌ను పరిశీలించాలనుకుంటున్నానని అన్నారు. మహువా తరపు న్యాయవాది ఎ.ఎం.సింఘ్వీ మౌఖిక ప్రస్తావనతో..

Also Read : ఉచితంతో రోడ్డున ప‌డ్డాం.. ఆదుకోకుంటే ప్ర‌జాభ‌వ‌న్ ముట్ట‌డిస్తాం

ఈ పిటిషన్‌ను శఅత్యవసరంగా జాబితా చేయాలని సిజెఐ చంద్ర చూడ్‌ డిసెంబర్‌ 13న ఆదేశించారు. అయితే డిసెంబర్‌ 16 నుండి కోర్టుకు శీతాకాల సెలవులు కావడంతో డిసెంబర్‌ 15 చివరి వర్కింగ్‌ డే. దీంతో పిటిషన్‌పై విచారణను 2024, జనవరి 3కి జాబితా చేస్తున్నట్లు ప్రకటించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube