న్యూస్‌క్లిక్ కేసులో ఢిల్లీ పోలీసులకు ‘సుప్రీం’ నోటీసులు
న్యూస్‌క్లిక్ కేసులో ఢిల్లీ పోలీసులకు 'సుప్రీం' నోటీసులు
న్యూస్‌క్లిక్ కేసులో ఢిల్లీ పోలీసులకు ‘సుప్రీం’ నోటీసులు
టీ మీడియా, నవంబర్ 7, న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్ కేసులో ఢిల్లీ పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపక చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్త, హెచ్‌ఆర్ విభాగం చీఫ్ అమిత్ చక్రవర్తి తమ ఇటీవల అరెస్టును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) కింద ఢిల్లీ పోలీసులు తమను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌న్లను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసును అత్యవసర విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ముందు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రస్తావించారు. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చినప్పుడు, ధర్మాసనం ఢిల్లీ పోలీసుల ప్రతిస్పందనను కోరుతూ రెండు పిటిషన్లకు సంబంధించి నోటీసు జారీ చేసింది.
Also Read : లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సమావేశం వాయిదా
పిటిషనర్ల తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ‘అరెస్టుకు సంబంధించిన ఆధారాలను రాతపూర్వకంగా అందించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన పంకజ్ బన్సల్ తీర్పును విస్మరించారు. అరెస్టు మెమో చూడండి. ఏమీ అందించబడలేదు’ అని పేర్కొన్నారు. జస్టిస్ గవారు జోక్యం చేసుకుని ‘సెలవు ముగిసిన వెంటనే మేము ఈ పిటిషన్‌ను తీసుకుంటాం’ అని చెప్పారు. ‘వైద్య కారణాలపై మధ్యంతర ఉత్తర్వులు కోసం ఒక దరఖాస్తు కూడా ఉంది. పిటిషనర్ పుర్కాయస్థ వయసు 71 ఏళ్లు’ అని కపిల్ సిబల్ తెలిపారు. ప్రధాన పిటిషన్లతోపాటు మధ్యంతర ఉపశమనం కోసం దాఖలు చేసిన దరఖాస్తును కూడా అదేరోజు విచారిస్తామని జస్టిస్ గవాయి తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube