సూర్యదేవాలయం శిల్ప కళానైపుణ్యం

చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు

1
TMedia (Telugu News) :

సూర్యదేవాలయం శిల్ప కళానైపుణ్యం

-చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు

లహరి,నవంబర్15,అద్యాత్మికం : సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ కులదేవతగా కొలిచేవారు. అలా మోడేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయ నిర్మాణంలో ఒక ప్రత్యేక‌త ఉంది.భారతదేశంలో ప్రాచీన ఆలయాలకు ప్రసిద్ధి. ఈ ఆలయాలు విశ్వాసానికి మాత్రమే కాదు భారతీయుల శిల్పకళా సంపదకు ఆనవాలగా చరిత్రలోనిలుస్తున్నాయి. ఒక్కొక్క ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంది. ఏ ఆలయానికి ఆ ఆలయం ఆధ్యాత్మిక రహస్యాలున్నాయి. హిందూ దేవుళ్లలో సూర్యుడిది ప్రత్యేక స్థానం. కానీ ఆ దేవాలయాలు మాత్రం చాలా అరుదనే చెప్పాలి. సూర్యదేవాలయం అనగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది కోణార్క్‌ సూర్య దేవాలయం. ఆంధ్ర ప్రదేశ్ లోని అరసవెల్లి సూర్య దేవాలయం కూడా ప్రముఖ‌మైన‌దే. వీటితో పాటు గుజరాత్‌లోని మోడేరాలో కూడా సూర్య దేవాలయం ఉంది. ఈ ఆల‌యానికి చాలా చారిత్రక ప్రాశస్త్యం ఉంది. స్కంద, బ్రహ్మ పురాణాల్లో ఈ పుణ్యక్షేత్ర ప్రదేశ ప్రస్తావ‌న ఉంది.అహ్మదాబాద్‌ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పుష్పవతి’ నదీ తీరాన మోడేరా దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని భీమ్‌దేవ్‌ సోలంకి అనే రాజు నిర్మించారు. తర్వాత కాలంలో సోమనాథ్‌ చుట్టు పక్కలనున్న ప్రాంతాలను విదేశీ ఆక్రమణదారుడైన మహమూద్‌ హమద్‌ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించి ఉంది.

Also Read : మహేష్ బాబు ఇంట ఏడాది లో మూడో విషాదం

గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీల రాజధాని ‘అహిల్‌వాడ్‌ పాటణ్‌’ తమ వైభవాన్ని కోల్పోయారు. తమ కీర్తిని, సంస్కృతిని కాపాడుకునేందుకు సోలంకి రాచరికపు కుటుంబం కొంత మంది వ్యాపారులతో కలిసి అందమైన ఆలయాల నిర్మాణం ప్రారంభించారు. సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ కులదేవతగా కొలిచేవారు. అలా మోడేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది.ఈ ఆలయ నిర్మాణంలో ఒక ప్రత్యేక‌త ఉంది. ఎక్కడా సున్నం వినియోగించకుండా, ఇరానీ శిల్పకళ శైలిలో రెండు భాగాలుగా నిర్మించారు. భారతదేశంలో నాలుగు సూర్యదేవుని ఆలయాలున్నాయి. వీటిలో మొదటిది ఒరిస్సాలోని కోణార్క్‌ మందిరం, రెండోది జమ్మూలోని మార్తాండ్‌ ఆలయం, మూడోది ఆంధ్రప్రదేశ్‌లోని అరసవెల్లి. నాలుగోది మనం చెప్పుకుంటున్న గుజరాత్‌లోని మోడేరాకు చెందిన సూర్య దేవాల‌యం. ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ మడేరా ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సంరక్షిస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube