కమిషనర్ ను సస్పెండ్ చేయాలి

కమిషనర్ ను సస్పెండ్ చేయాలి

1
TMedia (Telugu News) :

కమిషనర్ ను సస్పెండ్ చేయాలి

టీ మీడియా, మార్చి 30, వనపర్తి : వనపర్తి పట్టణంలో ఉన్న ఉపాధ్యాయ భవనపై ఫిర్యాదు చేసిన ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా రాత్రికి రాత్రే కమిషనర్ ట్రాన్స్ఫర్ పై వెళ్లడం ఆయనపై ఉన్న ఆరోపణలపై విచారణ చేసి కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిలపక్షం నాయకులు మంగళవారం డిమాండ్ చేశారు. ట్రాన్స్ఫర్ పై వెళ్ళిన కమిషనర్ ను సస్పెండ్ చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ఇదే విషయంపై సోమవారం ప్రజావాణిలో, హైదరాబాదులోని సంబంధిత ఆఫీసులో అఖిలపక్షం తరఫున ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు వెంకటేష్, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు జయరాములు, నరసింహ, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఆర్డీవోపై మరో ఏసీబీ కేసు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube