టీచర్ నరేందర్ ను సస్పెండ్

చేయాలి: ఎస్ ఎఫ్ ఐ

0
TMedia (Telugu News) :

టీచర్ నరేందర్ ను సస్పెండ్ చేయాలి: ఎస్ ఎఫ్ ఐ

టిమీడియా, మార్చి2, జూలూరుపాడు: ఆవేశంతో డస్టర్ విసిరి విద్యార్థి గాయాలపాలవడానికి కారణమైన టీచర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు గార్లపాటి పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. బుధవారం ఆయన మాట్లాడుతూ,గుండాల మండలం మామ కన్ను ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న అశోక్ అనే విద్యార్థి పై ఉపాధ్యాయుడు ఆవేశంతో డస్టర్ విసిరి వేయడంతో తలకు తీవ్ర గాయమైందని ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ సభ్యులు గార్లపాటి పవన్ కుమార్ అన్నారు.ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు నరేందర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తలకు అంత పెద్ద గాయం అయిన కనీసం యాజమాన్యం పట్టించుకునే పరిస్థితిలో లేరని అన్నారు. గాయంతో అశోక్ అనే విద్యార్థి 15 కిలోమీటర్ల ఇంటికి వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడీందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి జమ్మి యశ్వంత్, నాయకులు డి. పవన్ ఈల్లంగి శ్రీను, పెరుమల్ల పవన్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube