మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

0
TMedia (Telugu News) :

మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

టీ మీడియా, డిసెంబర్ 12, హైదరాబాద్ : మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ ఎత్తివేసింది. డిసెంబర్‌ 3న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగియక ముందే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని అప్పటి డీజీపీ అంజనీ కుమార్‌తోపాటు అదనపు డీజీ సంజయ్‌ కుమార్‌, మహేశ్‌ భగవత్‌ కలిశారు. దీంతో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని అంజనీ కుమార్‌ను సస్పెండ్‌ చేయగా, మిగిలిన ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు నోటీసులు జారీచేసింది. అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించలేదని ఈసీకి మాజీ డీజీపీ తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజున రేవంత్‌ రెడ్డి పిలిస్తే వెళ్లానని చెప్పారు. ఇలాంటి ఘటన పునరావృతం కాదని వివరణ ఇచ్చారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సీఈసీ సమాచారం అందించింది.

Also Read : కాంగ్రెస్‌ నాయకుడి నివాసాలపై ఐటీ దాడులు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube