టిఎంసి ఎంపి డెరెక్‌ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్‌ వేటు

టిఎంసి ఎంపి డెరెక్‌ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్‌ వేటు

0
TMedia (Telugu News) :

టిఎంసి ఎంపి డెరెక్‌ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్‌ వేటు

టీ మీడియా, డిసెంబర్ 14, న్యూఢిల్లీ : తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి డెరెక్‌ ఒబ్రెయిన్‌పై రాజ్యసభ సస్పెండ్‌ వేటు వేసింది. చైర్మన్‌ ఆదేశాలను ధిక్కరించడంతో పాటు దుష్ప్రవర్తన కారణంగా శీతాకాల సమావేశాలు పూర్తయ్యేంతవరకు ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ పేర్కొన్నారు. గురువారం సభ ప్రారంభం కాగానే భద్రతా వైఫల్యం అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇతర కార్యకలాపాలను రద్దు చేయాలని కోరడంతో పాటు ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమాధానమివ్వాలని పట్టుబట్టాయి. ఈ నోటీసులను చైర్మన్‌, స్పీకర్‌లు తిరస్కరించారు. అయితే చర్చ జరపాల్సిందేనని డెరెక్‌ పట్టుబట్టారు. ఆయనను వెంటనే సభ నుండి వెళ్లిపోవాలని చైర్మన్‌ ధన్‌ఖర్‌ ఆదేశించారు.

Also Read : శ్రీకృష్ణ జ‌న్మ‌భూమి భూవివాదం

తాను సభను వదిలి వెళ్లనని, చైర్‌ను ధిక్కరిస్తానని, నిబంధనలను గౌరవించనని ఒబ్రెయిన్‌ చెప్పారు. ఇది తీవ్రమైన దుష్ప్రవర్తన. ఈ ఘటన సిగ్గు చేటని పేర్కొంటూ.. శీతాకాల సమావేశాల ముగింపు వరకు ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube