మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

0
TMedia (Telugu News) :

మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

టీ మీడియా, సెప్టెంబర్ 23, వనపర్తి బ్యూరో : బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి పిలుపుమేరకు వనపర్తి జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో సేవ పక్వాడ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షురాలు వారణాసి కల్పన అధ్యక్షతన శుక్రవారం వనపర్తి పట్టణంలో టీచర్స్ కాలనీలోని బస్తి దవఖానలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2014లో నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని తలపెట్టి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం దేశవ్యాప్తంగా మరుగుదొడ్లను కట్టించటం జరిగిందని అన్ని పబ్లిక్ స్థలాలలోనూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాళ్లని పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతామని శుభ్రంగా ఉంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని మనతో పాటు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ఆమె పేర్కొన్నారు.

Also Read : చంద్రబాబు నాన్‌ లోకల్‌ : సీఎం జగన్‌

అనంతరం డాక్టర్ బాలమణిని కరోనా వ్యాక్సినేషన్,చిన్నపిల్లల వ్యాక్సిన్ గురించి టీబి పేషంట్ల చికిత్స గురించి వివరాలను అడిగి తెలుసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు సుమిత్రమ్మ, పద్మమ్మ ,ప్రధాన కార్యదర్శి కవిత, కార్యదర్శి సుగురు లక్ష్మి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube