స్వచ్ఛ భారత్ కుంభకోణం

రూ. 100 కోట్ల పై మాటే

0
TMedia (Telugu News) :

స్వచ్ఛ భారత్ కుంభకోణం

– రూ. 100 కోట్ల పై మాటే

– చెత్త పాలైన సంచార టాయిలెట్స్

– వెహికల్ యార్డ్ గేట్ సైతం మాయం

– మూతబడుతున్న టాయిలెట్స్

– ఖమ్మం మున్సిపల్ కుంభకోణాలు (1)

టి మీడియా, డిసెంబర్ 18, ఖమ్మం బ్యూరో : ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో భాగంగా గాంధీగిరి విధానంతో రూపొందించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.100 కోట్లకు పైగా కేవలం 2 ఏళ్ళ లో కుంభకోణంbకు దారి తీసింది. అందిన కాడికి కొంతమంది స్వాహ చేసారు. బహిరంగ మల, మూత్ర విసర్జన నిర్ములన అంటూ నగర పాలకానికి ఏడు ఆర్టీసీ బస్సులు ఇచ్చారు. పురుషులు, మహిళల కు వేర్వేరు గా ఈ బస్సులు ఇచ్చి అందులో ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు అయిన ఆ బస్సులను ప్రధాన కూడళ్లలో ఉంచేవారు. ప్రస్తుతం అవి మున్సిపల్ వెహికల్ యార్డ్ చెత్త పాలయ్యాయి. ఇవి కాక నగరం లో స్వచ్ఛ టాయిలెట్స్ పేరుతో భారి నిర్మాణాలు చేసారు. చాలా వరకు మూత పడి నిరుపయోగం గా మారాయి. ఇవి అన్ని ఇలా ఉండగా మున్సిపల్ కార్యాలయం ఆనుకుని ఉన్న వందల కోట్లు విలువ చేసే వాహనాలు ఉన్న యార్డ్ గేట్లు మాయం అయ్యాయి.విధుల్లో ఉండాల్సిన వాచ్ మెన్ లు కొంతమంది కార్పొరేటర్ల, అధికారుల ఇళ్లలో వెట్టి చాకిరీలో ఉన్నారు అని తెలిసింది.. భద్రత సిబ్బంది పేరుతో నెలకు లక్ష వరకు డ్రా చేస్తున్నట్లు గా తెలిసింది. ఆన్లైన్ లో ఉండాల్సిన ఖమ్మం స్వచ్ఛ భారత్ సమాచారం డిలేట్ అయింది అంటే అవినీతి స్థాయి తెలియజేస్తోంది. పాలక పక్షం కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగింది అనేది విశ్లేషకుల అభిప్రాయం గా ఉంది.

Also Read : దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఆర్టిసి కి టోకరా :
స్వచ్ఛ భారత్ కోసం ఆర్టిసి నుండి మున్సిపాల్టీ తీసుకున్న బస్సులు ఏడాది నుండీ యార్డ్ కు పరిమితం అయ్యాయి. అయినా ఆ బస్సుల డ్రైవర్ జీతాలు, డీజిల్, నిర్వహణ పేరుతో మున్సిపల్ నిధులు నెలవారి డ్రా చెయ్యడం తో పాటు, ఆర్టీసీ కి చెల్లించాల్సిన బస్సులు అద్దె చెల్లించడం లేదు అనేది తెలుస్తోంది. డ్రైవర్లను ఎడాది క్రింద వెనక్కి తీసుకొని వారికి ఆర్టీసీ జీతాలు ఇస్తోంది. బస్సులు మాత్రం ఆర్టీసీ అధికారులు వెనక్కి తీసుకొకపోవడం, మున్సిపల్ వెనక్కి ఇవ్వక పోవడం వేనుక భారీ కుంభ కోణం ఉన్నట్లుగా తెలుస్తోంది.

టాయిలెట్ల నిర్మాణంలో అవినీతి :
ఈ పథకం క్రింద చేసిన టాయిలెట్ల నిర్మాణం లో ఎక్కడ నాణ్యత ప్రమాణాలు లేవు.. వాటికి ఆనుకుని నిర్మించిన షాప్ లు అద్దెల విషయంలోనూ భారీ గోల్ మాల్ సాగుతున్నది. ఆ నిర్మాణాకు ఉన్న కరెంట్ కనెక్షన్ లు, బిల్లులు పెద్ద ఎత్తున మున్సిపల్ నిధులు దుర్వినియోగం ఉన్నది.

Also Read : 175 స్థానాల్లో విజయం సాధించేందుకే అభ్యర్థుల మార్పు

 

24/7 వెహికల్ యార్డ్ ఓపెన్ :
24 గంటల పాటు మున్సిపల్ వాహనాల పార్కింగ్ యార్డ్ తెరిచి ఉంటుంది. యార్డ్ గేట్లు మాయం అయ్యాయి. అక్కడి వాహనాల బ్యాటరీ లు, ఇతర పార్టులు మాయం అనేది సహాజంగా ఉంది. పార్కింగ్ యార్డ్ లో పేకాట, మద్యం సేవించడం లాంటివి నిత్య కృత్యము అనేది పరిశీలనలో వెల్లడి అయింది. రక్షణ సిబ్బంది అడ్రెస్ లేరు. సిసి కెమెరాలు లేవు. రాత్రి సమయం లో ఒకరు మాత్రం వస్తారు అతను విధుల్లో ఉండడు. ప్రక్కనే ఉన్న మున్సిపల్ ఆఫీస్ లో పడుంటాడని స్థానికులు తెలిపారు.యార్డ్ కి వచ్చిన, వెళ్లిన వాహనాల వివరాలు, రీడింగ్ నమోదు చేసే రిజిస్టర్ కూడా లేకపోవడం వెనుక భారీ అవినీతి అనేది తెలుస్తోంది. (వాహనం,డీజిల్, కాంట్రాక్టుల కుంభకోణం మరో కధనం లో.. )

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube