స్వచ్ఛ మణుగూరు పట్టణమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు .
టీ మీడియా, అక్టోబర్ ;22, మణుగూరు.
మణుగూరు అంబేద్కర్ సెంటర్ లో శుక్రవారం మున్సిపాలిటీ లోని జటాయు వాహనం ని జెండా ఊపి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు .
మణుగూరు మున్సిపాలిటీ పై ప్రత్యేక దృష్టి సారించిన విప్ రేగా కాంతారావు మున్సిపల్ సిబ్బంది మరియు ఇతర సమస్యల ను సీఎం కేసీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి వివరించిన వెంటనే రూ.22 లక్షల రూపాయల తో అధునాతన టెక్నాలజీ తో ఏర్పాటు చేసిన జటాయు వాహనం చెత్తను సేకరించే యంత్రాన్ని మంజూరు చేసారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పల్లెలు,పట్టణాలు అభివృద్ధి చెందునున్నాయి అన్నారు.
మణుగూరు లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలే అందుకు నిదర్శనం అని తెలిపారు అభివృద్ధి కి కట్టుబడి ఉన్నామని రాబోయే కాలంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్ ,జెడ్పీటీసీ పోశం నరసింహారావు, ఎంపీపీ కారం విజయ కుమారి, గూడి పూడి కోటేశ్వరరావు, అడప్పా అప్పారావు, మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
