వీధి కుక్కల స్వైర విహారం

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 21 వనపర్తి : వనపర్తి పట్టణంలో పలు వీధుల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మరేమ్మకుంట దగ్గర ఉన్న పలు చికెన్, మటన్, చేపలు అమ్మేవారు వాటి వ్యర్ధాలు మున్సిపల్ చెత్త బండికి వేయకుండా దర్గా ముందు ఉన్న ఖాళీ స్థలంలో వేయడం వల్ల అక్కడ కుక్కలు, పందులు గుంపులుగుంపులుగా తిరుగుతున్నాయి. అక్కడ వెళ్లే బాటసారులు స్కూల్ పిల్లల పైకి తిరగబడుతున్నాయి. ఇక్కడ ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. గతంలో పలు వీధిలో కుక్కలు చిన్న పిల్లలకు గాయాలపాలు చేశాయి.కావున మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా వార్డులో ఉన్న వేడుకలను ఎక్కడికైనా తరలించి అక్కడి వ్యాపారులకు జరిమానా విధించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Swire excursion of street dogs.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube