టీ హబ్ డయాగ్నస్టిక్ కేంద్రంలో అన్నీ పరీక్షలు నిర్వహించాలి

0
TMedia (Telugu News) :

టీ హబ్ డయాగ్నస్టిక్ కేంద్రంలో అన్నీ పరీక్షలు నిర్వహించాలి

టీ మీడియా,అక్టోబర్ 18,ఖమ్మం :ప్రభుత్వ ఆసుపత్రిలో 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించే టీ హబ్ డయాగ్నస్టిక్ కేంద్రంలో అన్నీ రకాల టెస్ట్ లను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం CPM టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ RMO బి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్ మాట్లాడుతూ లిక్విడ్ ఫ్రోఫైల్, ధైరయిడ్, యూరిన్ ఎగ్జామినేషన్, హార్మోన్ టెస్ట్ లు ఇలా చాలా ముఖ్యమైన టెస్ట్ లు గత కాలంగా టీ హబ్ లో జరగటం లేదు అని విమర్శించారు.

Also Read : పాలిటెక్నిక్ కళాశాలకు పూర్వ విభాగం తేవాలి

పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే టీ హబ్ డయాగ్నస్టిక్ కేంద్రంలో కోట్లాది రూపాయలు విలువచేసే యంత్రాలు తరుచుగా మరమత్తులు వస్తున్నాయి అని ఆరోపించారు. దినితో ప్రజలు బయట ప్రయివేటు హాస్పిటల్లో టెస్ట్ లకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడింది అని విమర్శించారు. వెంటనే టీ హబ్ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ టూ టౌన్ సెక్రటరీ బోడపట్ల సుదర్శన్, నాయకులు నర్రా రమేష్, MD గౌస్, కె వెంకన్న, హుస్సేన్, పి వాసు, SK బిబీ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube