డిప్యూటీ సి ఏం భట్టి పి.ఏ గా టి.శ్రీనివాస రావు

డిప్యూటీ సి ఏం భట్టి పి.ఏ గా టి.శ్రీనివాస రావు

0
TMedia (Telugu News) :

డిప్యూటీ సి ఏం భట్టి పి.ఏ గా టి.శ్రీనివాస రావు

టి మీడియా, డిసెంబర్ 29, మధిర : తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖా మంత్రి భట్టి విక్రమార్క మల్లుకు పి. ఏ గా తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావును నియమిస్తూ ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో భట్టి విక్రమార్క సిఎల్పీ నేత గా ఉన్న సమయంలోనూ శ్రీనివాస్ రావు పి ఏ గా పని చేశారు. విధుల పట్ల శ్రీనివాసరావు నిబద్ధతను పనితీరును మెచ్చిన భట్టి విక్రమార్క తిరిగి శ్రీనివాస రావును తిరిగి పి.ఏ గా నియమించుకున్నారు.ఈ సందర్భంగా పిఏగా నియమితులైన శ్రీనివాస రావు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : ప్రజలు పథకాలు అడుగుతున్నారు.. పత్రాలు కాదు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube