ఉత్కంఠ పోరులో.. భారత్‌ ఘన విజయం.

టీ20లో భారత జట్టు ముందుగా బౌలింగ్

1
TMedia (Telugu News) :

ఉత్కంఠ పోరులో.. భారత్‌ ఘన విజయం. -6 వికెట్ల తేడాతో సిరీస్‌ కైవసం -భారత జట్టు ముందుగా బౌలింగ్
-సూర్యకుమార్‌ యాదవ్‌ ఔట్‌.

టీ మీడియా,సెప్టెంబర్ 25,ఉప్పల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది. భారత బ్యాటర్లు చెలరేగి ఆడటంతో 6 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది                                                                                                                                                                                                        మూడో టీ20లో భారత జట్టు టాస్ గెలిచింది. దీంతో తాము ముందుగా బౌలింగ్ చేయనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే తమ జట్టులో ఒక మార్పు జరిగినట్లు వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో పంత్ ఆడటం లేదని, భువనేశ్వర్ తిరిగి జట్టులో కలుస్తున్నాడని చెప్పాడు. గత మ్యాచ్‌లో భువనేశ్వర్ పక్కనపెట్టి పంత్‌ను ఆడించిన సంగతి తెలిసిందే. మిగతా జట్టులో మార్పులు లేవని రోహిత్ అన్నాడు. ఆస్ట్రేలియా జట్టులో కూడా ఒక మార్పు చేసినట్లు ఆ జట్టు సారధి ఆరోన్ ఫించ్ తెలిపాడు. సీన్ అబాట్ స్థానంలో జోష్ ఇంగ్లిస్ ఆడుతున్నట్లు వెల్లడించాడు.భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, డానియల్ శామ్స్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

10:29
చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయాలి..
ఉప్పల్‌లో భారత్‌, ఆసీస్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. భారత్‌ విజయానికి చివరి ఓవర్‌లో 11 పరుగులు కావాలి. క్రీజులో కోహ్లీ, హార్ధిక్‌ పాండ్య ఉన్నారు.

 

ALSO READ :ఆస్పత్రిలో మంటలు..

సూర్యకుమార్‌ యాదవ్‌ ఔట్‌..
అర్థ శతకం పూర్తి చేసుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ ఆ తర్వాత చెలరేగి ఆడాడు. జంపా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన యాదవ్‌ తర్వాతి ఓవర్‌లో గ్రీన్‌ బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్‌ కొట్టాడు. అయితే 14 ఓవర్‌ చివరి బంతికి భారీ షాట్‌ కొట్టే ప్రయత్నంలో ఫించ్‌ చేతికి చిక్కాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 పరుగులు చేశాడు. మొత్తంగా 14 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.
9:57 PM
జంపా బౌలింగ్‌లో వరుస సిక్స్‌లు.. సూర్యకుమార్‌ అర్ధ శతకం
జంపా బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్ చెలరేగిపోయాడు. 13 ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లు కొట్టి స్కోరును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే యాదవ్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో 13 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ 122 పరుగులు చేసింది.

12 ఓవర్లకు భారత్‌ స్కోరు 107
భారత్‌ 12 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ, సూర్య కుమార్‌ యాదవ్‌ ఉన్నారు. భారత్‌ విజయానికి మరో 48 బంతుల్లో 80 పరుగులు చేయాలి.

దూకుడు పెంచిన భారత బ్యాటర్లు..సెంచరీ దాటిన స్కోరు
భారత్‌ స్కోరు సెంచరీ దాటింది. క్రీజులో ఉన్న కోహ్లీ, సూర్య కుమార్‌లు దూకుడు పెంచారు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతున్నారు. కోహ్లీ 26 బంతుల్లో 36 పరుగులు చేయగా.. అందులో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. సూర్య కుమార్‌ 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. దీంతో భారత్‌ స్కోరు సెంచరీ దాటింది.

10 ఓవర్లకు భారత్‌ స్కోరు 91
ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను కోహ్లీ, సూర్య కుమార్‌ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ 91 పరుగులు చేసింది. కోహ్లీ 35 పరుగులు, సూర్య కుమార్‌ యాదవ్‌ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు.

09:41
తొలి పవర్‌ప్లే ముగిసే సరికి భారత్‌ స్కోరు 50
రాహుల్ తొలి ఓవర్లోనే అవుటవడంతో రోహిత్‌పై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే భారీ షాట్ ఆడే యత్నంలో రోహిత్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ (22 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (4 నాటౌట్) ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో తొలి పవర్‌ప్లే ముగిసే సరికి భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.

రోహిత్‌ శర్మ ఔట్‌.. కష్టాల్లో భారత్‌
ఓపెనర్‌గా వచ్చిన రోహిత్‌ శర్మ కూడా ఔటవడంతో భారత్‌ కష్టాల్లో పడింది. రాహుల్‌ ఔటైన తర్వాత కోహ్లీ క్రీజులోకి రావడంతో కాస్త దూకుడు పెంచిన రోహిత్‌.. స్కోరును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. అయితే నాలుగో ఓవర్లో కమిన్స్‌ అద్భుతమైన బౌలింగ్‌తో రోహిత్‌ను ఔట్‌ చేయడంతో భారత్‌ కష్టాల్లో పడింది. భారత్‌ నాలుగో ఓవర్‌ ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది.

రోహిత్‌ భారీ సిక్స్‌..
రెండో ఓవర్‌ చివరి బంతికి రోహిత్‌ శర్మ భారీ సిక్స్‌ కొట్టాడు. జోష్ హాజిల్‌వుడ్ వేసిన రెండో ఓవర్‌లో కోహ్లీ ఒక పరుగు చేయగా.. రోహిత్‌ శర్మ సిక్స్‌ , ఫోర్‌తో 10 పరుగులు చేశాడు. మొత్తంగా రెండో ఓవర్లో 11 పరుగులు భారత్‌ ఖాతాలో చేరాయి.

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. డానియల్ శామ్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించిన కేఎల్‌ రాహుల్‌.. మాథ్యూ వేడ్ చేతికి చిక్కాడు. దీంతో తొలి ఓవర్‌లో వికెట్‌ నష్టానికి భారత్‌ 5 పరుగులు మాత్రమే చేసింది.

ALSO READ :ట్రస్ట్ సేవ కార్యక్రమాలు చూసి కన్ను కుట్టింది

క్రీజులోకి వచ్చిన రాహుల్‌, రోహిత్‌
187 పరుగులు విజయలక్ష్యంతో భారత్‌ బరిలో దిగింది. కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ ఓపెనర్లుగా వచ్చారు.

8:46 PM
భారత్‌ లక్ష్యం 187.. ఆసీస్‌ స్కోరు 186/7
నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్‌ జట్టు 186 పరుగులు సాధించి.. భారత్‌ ఎదుట 187 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, చాహల్‌ తలో వికెట్‌ లభించింది. ఆసీస్‌ జట్టులో 54 పరుగులతో టిమ్‌ డేవిడ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

టీమ్‌ డేవిడ్‌ అవుట్‌..ఏడో వికెట్‌ కోల్పోయిన్‌ ఆసీస్‌
ఆసీస్‌ జట్టు ఏడో వికెట్‌ కోల్పోయింది. 20వ ఓవర్‌లో 3వ బాల్‌కు టీమ్‌ డేవిడ్‌ అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం 19.3 ఓవర్లకు ఆసీస్‌ జట్టు 185 పరుగులు సాధించింది. 27 బంతుల్లో టీమ్‌ డేవిడ్‌ 54 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
08:39
19వ ఓవర్‌లో ఆసీస్‌కు 18 రన్స్‌
ఆసీస్‌ జట్టు 19వ ఓవర్‌లో 18 పరుగులు పిండుకున్నది. జస్ప్రీత్‌ భూమ్రా వేసిన ఓవర్‌లో ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌ బాదగా.. ఫీల్డర్‌ పాండ్యా వేసిన ఓవర్‌ థ్రో అదనంగా ఆరు పరుగులు ఆసీస్‌కు లభించాయి. 19వ ఓవర్‌ ముగిసే వరకు 179 పరుగులు ఆసీస్‌ సాధించింది.
ఆసీస్‌ స్కోర్‌ 140/17
ఆసీస్‌ జట్టు 17 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 140 పరుగులు సాధించింది. టిమ్‌ డేవిడ్‌, డానియల్‌ శ్యామ్స్‌ క్రీజులో ఉన్నారు.

ఆరో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌.. మ్యాథ్యూవేడ్‌ ఔట్‌
ఆసీస్‌ జట్టు ఆరో వికెట్‌ను కోల్పోయింది. 14వ ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌ వేసిన తొలి బంతికే జాష్‌ ఇంగ్లిష్ క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరగగా.. ఐదో బంతికి మ్యాథ్యూవేడ్‌.. 117 పరుగుల వద్ద బౌలర్‌కే క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

 

ALSO READ :నేడు భారత్‌, ఆస్ట్రేలియా ఆఖరి టీ20*

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
ఐదో వికెట్‌ రూపంలో జోఇంగ్లిస్‌ అవుట్‌ అయ్యాడు. 14వ ఓవర్‌లో అక్షర్‌పటేల్‌ వేసిన తొలి బంతికే క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. 14.1 ఓవర్లకు గాను ఆసీస్‌ 115/5 స్కోర్‌ చేసింది. జాష్‌ 22 బంతుల్లో 24 పరుగులు సాధించాడు.

 

08:04 PM
వంద పరుగులు దాటిన ఆసీస్‌ స్కోరు
12 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్‌ స్కోరు వంద పరుగులు దాటింది. చాపెల్ వేసిన 12వ ఓవర్లో ఆసీస్‌ బ్యాటర్లు ఒక ఫోర్‌ సహా 8 పరుగులు చేశారు. దీంతో 12వ ఓవర్‌ ముగిసే సమయానికి స్కోరు 103 పరుగులు చేసింది.

భారత బౌలర్ల విజృంభణ.. జాగ్రత్తగా ఆడుతున్న ఆసీస్‌ బ్యాటర్లు
ఇన్నింగ్స్‌ ప్రారంభంలో దూకుడుగా ఆడిన ఆసీస్‌ బ్యాటర్లు వరుస వికెట్లు కోల్పోవడంతో జాగ్రత్తగా ఆడుతున్నారు. నాలుగు ఓవర్లలోనే 50 పరుగులు చేసిన ఆసీస్‌ బ్యాటర్లు.. భారత బౌలర్లు విజృంభించడంతో ఆచితూచి ఆడుతున్నారు. దీంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
84 పరుగుల వద్ద ఆసీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. చాహల్‌ బౌలింగ్‌లో దినేశ్‌ కార్తిక్‌ చేతికి స్మిత్‌ చిక్కాడు.
మ్యాక్స్‌వెల్‌ రనౌట్‌లో డ్రామా
మూడో వికెట్‌ రూపంలో మ్యాక్స్‌వెల్‌ రనౌట్‌ ఔటయ్యాడు. రనౌట్‌ విషయంలో చిన్న డ్రామా జరిగింది. అక్షర్‌ పటేల్‌ విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకడంతో స్టిక్‌ లేసింది. అయితే కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ చేయి వికెట్లను తాకడంతో నాటౌట్‌గా భావించారు. చివరికి థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా తేల్చడంతో భారత ఆటగా
, ప్రేక్షులు ఆశ్చర్యానికి లోన

మూడో వికెట్‌ కోల్పోయిన
74 పరుగుల వద్ద ఆసీస్‌

7 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్‌ 71
ఏడు ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్‌ రెండు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. క్రీజులో మ్యాక్స్‌వెల్ 4‌, స్మిత్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికె
ట్‌ కోల్పోయింది. గ్లెన్‌ మ్యా
19 బంతుల్లో హాఫ్‌ సెంచరీ
ఆసీస్‌ ఓపెనర్‌ కామెరోన్‌ కేవలం 19 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడు. మూడు సిక్స్‌లు, ఏడు ఫోర్ల సాయంతో అర్థ శతకం సాధించి.. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో ఔట
య్యాడు.చేసిన కామెరోన్క్స్‌

కీలక వికెట్‌ కోల్పోయిన ఆ
ఆసీస్‌ కీలక వికెట్‌ కోల్పోయింది. అర్ధ శతకం పూర్తి చేసుకున్న కామెరూన్‌ 52 పరుగుల వద్ద భువనేశ్వర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారీ షాట్‌కు యత్నించిన కామెరోన్‌ భువనేశ్వర్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌కు చిక్కాడు.
సీస్‌వెల్‌ (6) రనౌటయ్యాడు
07:20 PM
వరుస ఫోర్లతో చెలరేగిన కామెరోన్‌
ఫించ్‌ ఔటవడంతో కామెరోన్‌ చెలరేగిపోయాడు. వరుసగా మూడు ఫోర్లు బాదాడు. దీంతో నాలుగు ఓవర్‌లోనే స్కోరు 50 పరుగులు దాటింది. నాలుగో ఓవర్‌ ముగిసే సమ
07:18 PM
తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
ఆస్ట్రేలియా 44 పరుగుల వద్ద ఆరోన్‌ ఫించ్‌ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. భారీ షాట్‌కు ప్రయత్నించిన ఫించ్‌ అక్సర్‌ పటేల్‌ బౌలింగ్‌లో హార్ధిక్‌ పాండ్యా చేతికి చిక్కా

ALSO READ :వివాహేతర సంబంధం.. ప్రియురాలి భర్త హత్య

మూడు ఓవర్లు ముగిసే సరి
ఆస్ట్రేలియా బ్యాటర్లు మూడో ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌ బాదారు. మొత్తంగా మూడో ఓవర్‌లో 15 పరుగులు రాబట్టారు.

07:13 PM
దూకుడుగా ఆడుతున్న ఆసీస్‌ బ్యాటర్లు.
ఆసీస్‌ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. వరుస బౌండరీలతో స్కోరును పరుగులు పెట్టిస్తున్నారు. రెండు ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్‌ 23. కామెరోన్‌ 21, ఫించ్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి ఓవర్‌లో చెలరేగిన కామెరోన్‌
భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ ప్రారంభమైంది. ఆరోన్‌ ఫించ్‌, కామెరోన్‌ క్రీజులోకి వచ్చారు. భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్‌లోనే కామెరోన్‌ చెలరేగి ఆడాడు. వరుసగా సిక్స్‌ ఫోర్‌ కొట్టడంతో తొలి ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి.కి స్కోర్‌ 40 డు.యానికి ఆసీస్‌ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. (.ఆసీస్‌య్యారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube