బోధ వ్యాది నివారణ మాత్రలు పంపిణి 

బోధ వ్యాది నివారణ మాత్రలు పంపిణి 

1
TMedia (Telugu News) :

బోధ వ్యాది నివారణ మాత్రలు పంపిణి 

టీ మీడియా,అక్టోబర్20,మధిర:

బోధ వ్యాది నివారణ మాత్రలు పంపిణి చేసిన మధిర మండలం ఎంపీపీ మొండెం లలిత వెంకయ్య. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున పిహెచ్సి దెందుకూరు వైద్యులు డాక్టర్ శశిధర్ ఆధ్వర్యంలో సామూహిక బోధ వ్యాది నివారణ మాత్రలను మండలం లోని మహాదేవపురం గ్రామం లో ప్రతి ఒక్కరికి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ…
తాను ముందుగా వయసును బట్టి డి ఈ సి టాబ్లట్ లు, ఆల్బండజోల్ టాబ్లెట్, ఐ వర్ మెర్టిన్ టాబ్లెట్ తాను మ్రింగి ప్రజలలో ఉన్న అనుమానాలు భయాలు తొలగించి ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురికాకుండా ధైర్యంగా మాత్రలు వేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం వైద్య అధికారి డాక్టర్ శశిదర్ ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి,సర్పంచ్ నరికూటి బంగారమ్మ, తులసీ రాం, ఆరోగ్య పరివేక్షకులు
లంకా కొండయ్య, నోడల్ పర్సన్ ఆర్వి సుబ్బలక్ష్మి,హెచ్వి బి కౌసల్య, హెచ్ఇఒ యస్ గోవింద్,ఎఎన్ఎమ్ డి జయమ్మ, హెచ్ఎ నాగేశ్వరరావు ఆశ కార్యకర్తలు అంగన్వాడీ లు ఐకేపీ సిబ్బంది జిపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube