ఇంట‌ర్ విద్యార్థుల‌కు ట్యాబ్స్ పంపిణీ

కేటీఆర్ ట్వీట్

2
TMedia (Telugu News) :

ఇంట‌ర్ విద్యార్థుల‌కు ట్యాబ్స్ పంపిణీ

– కేటీఆర్ ట్వీట్

టీ మీడియా, సెప్టెంబర్ 19, హైద‌రాబాద్ : రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని ప్ర‌భుత్వ క‌ళాశాల విద్యార్థుల‌కు గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా త్వ‌ర‌లోనే ట్యాబ్లెట్స్ పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంట‌ర్ చ‌దువుతున్న విద్యార్థుల‌కు ఈ ట్యాబ్స్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయ‌ని పేర్కొన్నారు.

Also Read : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె

ఈ ట్యాబ్స్‌లో ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డే మెటీరియ‌ల్‌ను పొందుప‌రిచిన‌ట్లు కేటీఆర్ తెలిపారు. ఇంట‌ర్ మెటీరియ‌ల్‌తో పాటు పోటీ ప‌రీక్ష‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే స‌మాచారం కూడా అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు. అయితే త‌న హామీని నెర‌వేర్చుకునే స‌మ‌యం ఆస‌న్నం కావ‌డంతో సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ట్యాబ్స్‌ను తానే స్వ‌యంగా పంపిణీ చేస్తాన‌ని కేటీఆర్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube