తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలి

తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలి

1
TMedia (Telugu News) :

తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలి
టీ మీడియా, ఎప్రిల్ 01, వనపర్తి : ఆత్మకూరు మండలం పోట్లంపల్లి గ్రామంలో 25 ఎకరాల భూమిని వేరే వారి మీద పట్టా చేయడం జరిగింది. భూమి సర్వే నెంబర్ 116, 117 సర్వే నెంబర్లు 25 ఎకరాల భూమిని రాత్రికి రాత్రే 17 కుటుంబాల పేర్లు మార్చి వేసిన రెవెన్యూ అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని గత ఎమ్మార్వో జె.కె.మోహనరావుపై రమేష్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని తెలంగాణ జన సమితి పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు ఖాదర్ భాష, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మధులత గురువారం వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ జెసి వేణుగోపాల్ గారు పైన చర్యలు తీసుకోవాలని కోరారు. 17 కుటుంబాలకు న్యాయం చేయాలని పలు సంఘాల నాయకులతో కలిసి గురువారం కలెక్టర్ కార్యాలయం ముందు రైతులతో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన నాయకులు శివ, రైతులు భూనిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : వైద్యురాలినిఆత్మహత్యకు ప్రేరేపించిన బీజేపీ నేత అరెస్ట్‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube