రజత్ కుమార్ పై చర్యలు తీసుకోండి

టి మీడియా, మార్చి 10,హైద్రాబాద్

1
TMedia (Telugu News) :

రజత్ కుమార్ పై చర్యలు తీసుకోండి.. సీఎస్ కు ఆదేశాలు..!
టి మీడియా, మార్చి 10,హైద్రాబాద్:
ఐఏఎస్ అధికారి రజత్‌ కుమార్‌ పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆయన కుమార్తె వివాహానికి ఓ బడా కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించడంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు లేఖ రాసినట్లు సమాచారం. రజత్‌ కుమార్ ‎పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Also Read : అనుమానస్పదస్థితిలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

రజత్ కుమార్తె వివాహ బిల్లులకు సంబంధించి కొద్ది రోజుల క్రితం ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ పరిశోధనాత్మక కథనం ఇచ్చింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. గత డిసెంబర్‌ లో పెళ్లి తంతు జరగగా.. ఫలక్‌ నూమా ప్యాలెస్, తాజ్ డెక్కన్, తాజ్ హోటల్స్‌ లో పలు ఈవెంట్స్ నిర్వహించారు. ఈ ఫైవ్ స్టార్ వివాహానికి ఓ మిస్టరీ కంపెనీ డబ్బులు ఖర్చు చేసినట్లు కథనాలు వచ్చాయి.

ప్రభుత్వంలో కీలక శాఖలో పని చేస్తున్న రజత్ కుమార్ ఇంట్లో పెళ్లికి ఫేక్ ఐడీతో ఉన్న కంపెనీ డబ్బులు ఖర్చు పెట్టడం వివాదాస్పదమైంది. ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. సామాజిక వేత్తలు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు ఈ విషయంపై స్పందించారు. ఈ క్రమంలోనే 2018 ఎన్నికల్లో ఓట్ల మిస్సింగ్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలోనే పెళ్లి ఇష్యూపై కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. దీంతో చర్యలు తీసుకోవాలని సీఎస్ కు హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.!

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube