ఇబ్బంది పెట్టె వారిపై చర్యలు: సీఐ

ఇబ్బంది పెట్టె వారిపై చర్యలు: సీఐ

1
TMedia (Telugu News) :

ఇబ్బంది పెట్టె వారిపై  చర్యలు: సీఐ*

టీ మీడియా, మార్చి 8, వేములవాడ:

ఇటీవలి కాలంలో కొంతమంది సహజంగా తమకు భగవంతుడు ఇచ్చిన తమ శారీరక అసమతౌల్యాన్నికలిగిన వర్గానికి చెందిన వారు పట్టణంలో ఎక్కడ శుభకార్యం జరిగినా వారి ఇంటి ముందు వాలిపోయి ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తూ. దౌర్జన్యంగా వేలకు వేలు డబ్బులు గుంజుతున్న సంఘటనలు దృష్టికి వస్తూ ఉన్నవి. ఇంటిల్లిపాది సంతోషంగా చేసుకునే వేడుకలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్లు ఇంకా ఏదైనా వేడుక చేసుకునే సందర్భంలో ఇంటి ముందు వేసి ఉన్న టెంట్ ను గమనించి ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తున్న పలు సంఘటనలు మా దృష్టికి వస్తున్నవి.

Also Read : వేములవాడ రాజన్న కు బంగారు రుద్రాక్షమాల

వేడుక జరుపుకునే వారు వేలకు వేల రూపాయలు ఇచ్చేంతవరకు రకరకాలుగా వేధిస్తూ ఇంటిల్లిపాది ముందు దుర్భాషలు ఆడుతూ దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటువంటి వారు వారి జీవన ఉపాధి కోసం ఇతర వృత్తిలో లేక చిన్న చిన్న పనులు కూలి పనులు చేసుకుని జీవించాలి తప్ప ఇతరులపై పడి దౌర్జన్యంగా డబ్బులు సంపాదిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించటం అనైతికం కావున ఇప్పటి నుండి తమ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని.. ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే బాధితులు వెంటనే డయల్ 100 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అట్టి వారిపై కేసులు నమోదు చేస్తామని. వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube