“ప్రజాపాలన” ను సద్వినియోగం చేసుకోండి

"ప్రజాపాలన" ను సద్వినియోగం చేసుకోండి

0
TMedia (Telugu News) :

“ప్రజాపాలన” ను సద్వినియోగం చేసుకోండి

– ఎంపిపి పద్మా సైదేశ్వరావు

 టీ మీడియా, జనవరి 4, మేళ్ళ చెరువు : అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేళ్ళ చెరువు ఎంపిపి పద్మా సైదేశ్వరావు తెలియజేశారు. గురువారం మేళ్ళ చెరువు మండల పరిధిలోని వేపల మాధారం, రామాపురం  గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలిపిన విధంగా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని, వంటింటి గ్యాస్ రూ. 500 కే ఇస్తామని చెప్పిన విధంగా అర్హులైన ప్రతి కుటుంబానికి అందజేస్తుందని, అలాగే ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రూ. ఐదు లక్షలు అందజేహస్తుందని, , ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ లో ముందుగా వృద్దులు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తుందని, ఆసరా పింఛన్ పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదని ఎంపీపీ  కొట్టె పద్మా సైదేశ్వరావు తెలియజేశారు.

Also Read : క్రీడాకారిణి నందినికి ఘన సన్మానం

పెన్షన్ కు అర్హులైన కొత్తవారు మాత్రమే చేయూత పెన్షన్  కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. అధికారులు ప్రతి ఒక్కరి దరఖాస్తులు స్వీకరించాలనీ ఎంపీపీ  అన్నారు ఈ కార్యక్రమానికి , అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, గ్రామ ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube