ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి      

దొంతగాని శ్రీనివాస్ గౌడ్

0
TMedia (Telugu News) :

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి                            – దొంతగాని శ్రీనివాస్ గౌడ్

టీ మీడియా, డిసెంబర్ 28, హుజూర్ నగర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ అన్నారు. గురువారం స్థానిక 20 వార్డులో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ  కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,స్థానిక కౌన్సిలర్ దొంతగాని పద్మతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దరఖాస్తు పత్రాలను వివిధ శాఖల సిబ్బందితో ప్రభుత్వమే అందజేస్తుందని తెలిపారు. డిసెంబరు 31,జనవరి 1 సెలవు దినాలు పోగా మొత్తం ఎనిమిది రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమాలలో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని వార్డు సభ్యులు సూచించారు. కార్యక్రమంలో నాయకులు పండ్ల హుస్సేన్ గౌడ్,దొంతగాని జగన్,గండు అర్జున్,తురక వీరబాబు, గుడెల్లి అంజి, సింగు రవి,గణపతి, కవిత, సిబ్బంది పాల్గొన్నారు

Also Read : వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube