ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా

-వనపర్తి పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టాను

0
TMedia (Telugu News) :

ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా

-వనపర్తి పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టాను

– రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

టీ మీడియా, అక్టోబర్ 30, వనపర్తి బ్యూరో : ప్రజలకు ఏం కావాలో గ్రహించి అభివృద్ధి పనులు చేసుకుంటూ పని చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, వనపర్తి పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టానని,
దేశంలో వ్యవసాయిక జిల్లాగా వనపర్తిని అగ్రస్థానంలో ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు.
జిల్లా కేంద్రం 4వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మునికుమార్, బాలరాజు ఆధ్వర్యంలో సోమవారం మంత్రి నివాస గృహంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది యువకులు , మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముందుగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Also Read : షిండే, పవార్‌ల అనర్హత పిటిషన్‌లపై స్పీకర్‌ చర్యలకు సుప్రీం డెడ్‌లైన్‌

చేస్తున్న అభివృద్ధి నిత్యం గమనిస్తున్నామని ఇంత అభివృద్ధి చేసే నాయకుడి వెంట మేమంతా నడవాలని ఉద్దేశ్యం తో పార్టీలో చేరడం జరిగిందని అభివృద్ధి లో భాగస్వాములం అవుతామని వారు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సమయాన్ని వృధా చేయకుండా ఎంత వేగంగా పని చేస్తే అంత వేగంగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రజలకు ఎం కావాలి ఎం చేయాలో ముందు చూపుతో ప్రణాళికలను సిద్ధం చేసుకుని పనులు చేయడం వల్లనే అభివృద్ధి మీ ముందర కనిపిస్తుందని, మాటలు చెప్పడం రాదు పని చేయడం నా పని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. వనపర్తి ని విధ్యాపర్తిగా మార్చడంతో పాటు మెడికల్, ఇంజనీరింగ్, నర్సింగ్ , మత్స్య, వ్యవసాయ కళాశాలను తీసుకుని రావడం వల్ల ఉన్నత విద్య కోసం బయటి ప్రాంతాలకు వెళ్లకుండా జిల్లా కేంద్రంలో నే అభ్యసించవచ్చునని మంత్రి వివరించారు. చేయాలన్న సంకల్పం ఉంటే వనపర్తి అభివృద్ధి ఇంత వేగంగా అభివృద్ధి చేయవచ్చని చేసి చూపించానని మంత్రి గుర్తు చేశారు. పాత కొత్త నాయకులు అందరు కలిసి పనిచేయాలన్నారు.

Also Read : ఎంపీ దాడి ఘటనపై విచారణకై డీజీపీకి ఆదేశాలు

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ , మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమేష్ గౌడ్ , కౌన్సిలర్లు బండారు కృష్ణ, కో అప్షన్ సభ్యులు ఇమ్రాన్ , మండల యువజన సంఘం అధ్యక్షుడు చిట్యాల రాము ,నాయకులు రామస్వామి, బొడ్డుపల్లి సతీష్ కుమార్, చేరిన వారిలో శివ కుమార్, వెంకటేష్, విజయ్, వెంకటేష్, యాదగిరి, శ్రీకాంత్, భీమ్ నాయక్, రమేష్ దశరతమ్మ, అంజలి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube