లంచాలు తీసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని గండి

టౌన్ ప్లానింగ్ అధికారులను సస్పెండ్ చేసి జైల్లో పెట్టాలి

0
TMedia (Telugu News) :

లంచాలు తీసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని గండి

– టౌన్ ప్లానింగ్ అధికారులను సస్పెండ్ చేసి జైల్లో పెట్టాలి

– ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్

టీ మీడియా, అక్టోబర్ 9, వనపర్తి బ్యూరో : లంచాలు తీసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్న అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులను సస్పెండ్ చేసి జైల్లో పెట్టాలని ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అన్నారు.అలాగే కొన్ని లొసుగులు సృష్టించి నకిలీ ఎల్ఆర్ఎస్ లను సృష్టించి ఫైలు తయారు చేస్తున్న టౌన్ ప్లానింగ్ లైసెన్స్ సర్వేయర్ల లైసెన్సులను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ కి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అఖిల పక్ష ఐక్యవేదిక ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. కొన్నాళ్లుగా రామ్ నగర్ కాలనీ నుండి రాజనగరం రోడ్డు వరకు ఇండస్ట్రియల్ ఏరియా గా ఉన్న దానిని ప్రజల అభ్యర్థన మేరకు తొలగించి నివాసయోగ్యం జోన్ గా మార్చే జీవో ను మంత్రి తీసుకువచ్చారు.కానీ వనపర్తి లో కొందరు లైసెన్స్ సర్వేయర్లు టౌన్ ప్లానింగ్ అధికారులు కలిపి ఆ జీవోను తూట్లు పొడిచేలా, ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారని ఉదాహరణకు రాజనగరం రోడ్డు లోని 137/B లో మళ్లీ ఇండస్ట్రియల్ జోన్గా చూయించి నకిలీ ఎల్అర్ఎస్ రసీదులు సృష్టించి 25 లక్షల ఫైల్ ను లంచాలు తీసుకుని 12 లక్షలు మాత్రమే ప్రభుత్వానికి చెల్లించేలా కమర్షియల్ బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి మోసాలు వనపర్తి లో చాలా జరుగుతున్నాయని వాటి వల్ల ప్రభుత్వానికి నష్టం చేకూరుతుందని అది ప్రజలందరికీ భారం పడుతుందని కనుక కలెక్టర్ పై అధికారులు వీటిపై చర్య తీసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెరగేలా చూడాలని,

Also Read : తెలంగాణలో ఓటర్ల వివరాలు ఇలా

వనపర్తి లో ఇచ్చిన అనుమతులను తిరిగి పరిశీలన చేయాలని లేనియెడల హెడ్ ఆఫీస్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కి ఫిర్యాదు చేయడంతో పాటు తగిన సాక్షాదారులతో ప్రైవేట్ కేసు నమోదు చేస్తామని ప్రజల భాగస్వామ్యంతో ఇలాంటి అరాచకాలను అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిలదీస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు ఎస్సీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, కాంగ్రెస్ నాయకులు కురుమూర్తి, గంధం సుమన్, రమేష్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.\

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube